హాట్ టాపిక్‌గా మారిన వరుణారెడ్డి పేరు.. తెరపైకి మొద్ద శీను హత్య ఘటన.. జగన్ ప్రభుత్వం ఉదారత చూపిందా..?

Published : Feb 13, 2022, 11:11 AM IST
హాట్ టాపిక్‌గా మారిన వరుణారెడ్డి పేరు.. తెరపైకి మొద్ద శీను హత్య ఘటన.. జగన్ ప్రభుత్వం ఉదారత చూపిందా..?

సారాంశం

పోచా వరుణారెడ్డి (Pocha Varuna Reddy) పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కడప జిల్లా సెంట్రల్ జైలు (kadapa central jail ) ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా వరుణారెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. అయితే గతంలో శాఖపరమైన శిక్షకు గురైన వరుణారెడ్డిపై వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (YS Jagan) అంతులేని ఉదారత చూపుతున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడటం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. 

పోచా వరుణారెడ్డి (Pocha Varuna Reddy) పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కడప జిల్లా సెంట్రల్ జైలు (kadapa central jail ) ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా వరుణారెడ్డి ఇటీవల బాధ్యతలు చేపట్టారు. అయితే ప్రస్తుతం కడప జైలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులైన దేవిరెడ్డి శంకర్‌ రెడ్డి, సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్‌ రెడ్డిలు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర (Paritala Ravindra) హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మొద్దు శ్రీను 2008లో అనంతపురం జైలులో దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ సమయంలో వరుణారెడ్డి ఇన్‌చార్జి సూపరిండెంటెండ్‌గా ఉన్నారు. దీంతో విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మొద్దు శ్రీను హత్య జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. 

భద్రతాపరమైన అంశాల అమలులో విఫలమైనట్టుగా తేలడంతో వరుణారెడ్డి అప్పటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వంలో సస్పెండ్‌కు గురయ్యారు. ఆ తర్వాత ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకుంది. అయితే గతంలో శాఖపరమైన శిక్షకు గురైన వరుణారెడ్డిపై వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంతులేని ఉదారత చూపుతున్నారంటూ మీడియాలో కథనాలు వెలువడటం తీవ్ర సంచలనం రేపుతున్నాయి. దీంతో వరుణారెడ్డి ఒక్కసారిగా హాట్ టాఫిక్‌గా మారారు. మీడియా కథనాల ప్రకారం..

2008 నవంబర్ 9వ తేదీన అనంతపురం జిల్లా జైలులో పరిటా రవి హత్య కేసు ప్రధాన నిందితుడు మొద్దు శీను హత్యకు గురయ్యాడు. మొద్దు శీను హత్య జరిగినప్పుడు అనంతపురం జిల్లా జైలు సూపరింటెడెంట్ సెలవులో ఉన్నారు. ఆయన బాధ్యతలను ఇంచార్జ్‌గా పోచా వరుణారెడ్డి వ్యవహరించారు. అయితే పరిటాల రవి హత్య కేసు తుది దశకకు చేరుకుంటున్న సమయంలో.. ఈ హత్య జరిగింది. అనంతపురం జిల్లా జైలులో ఎడమ వైపున గోదావరి, గంగ, యమున, సరస్వతి1,2 బ్యారెక్‌లు ఉండేవి. మొద్దు శీను యమున బ్యారెక్‌లో ఉండేవాడు. హత్య చేసిన ఓం ప్రకాశ్ సరస్వతి-2 బ్యారెక్‌లో ఉండేవాడు. అయితే ఓం ప్రకాశ్‌ను.. మొద్దు శ్రీను ఉంటున్న యమున బ్యారెక్‌లోకి తరలించారు. దీనిపై మొద్ద శీను అభ్యంతరం వ్యక్తం చేసిన పట్టించుకోలేదు. ఆ తర్వాత మొద్దు శీనును ఓం ప్రకాశ్ సిమెంట్‌తో తయారు చేసిన డంబుల్‌తో మోది హత్య చేశారు. 

ఓం ప్రకాశ్‌ను ఉద్దేశపూర్వకంగానే మొద్దు శీను బ్యారెక్‌లోకి పంపించారని పరిటాల రవి హత్య కేసులో మరో నిందితుడైన పటోళ్ల గోవర్దన్ రెడ్డి అప్పట్లో అనంతపురంజిల్లా న్యాయమూర్తికి లేఖకూడా రాశారు. మొద్ద శీను హత్య జరగడానికి జైలు ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా ఉన్న వరుణారెడ్డి తీవ్ర నిర్లక్ష్యమే కారణమని అప్పటి ప్రభుత్వం అభియోగాలు మోపింది. డంబుల్ వంటివి ఖైదీల వద్దకు ఎలా వచ్చాయనే దానిని గుర్తించడంలో వరుణారెడ్డి విఫలమయ్యారని పేర్కొంది. ఈ క్రమంలోనే వరుణారెడ్డిపై వచ్చిన అభియోగాలపై సమగ్ర విచారణ జరిపిని అప్పటి జైళ్ల శాఖ డీజీ.. ఆయనకు భవిష్యత్తు ఇంక్రిమెంట్లు, పింఛన్‌పై ప్రభావం పడేలారెండేళ్ల పాటు ఇంక్రిమెంట్లు వాయిదా వేశారు. సస్పెషన్ కాలాన్ని విధుల్లో లేని సమయంగా పరిగణిస్తూ పనిష్మెంట్ ఇచ్చారు.  తర్వాత వరుణారెడ్డికి విధించిన పనిష్మెంట్‌ను 2013 ఫిబ్రవరి 8న కొద్దిగా సవరిస్తూ హోం శాఖ ఆదేశాలిచ్చింది. క్యుమిలేటివ్ ప్రభావం లేకుండా ఏడాదిపాటు వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్‌ను నిలుపుదల చేసింది. 

ఇక, 2019 ఫిబ్రవరిలో తనకు విధించిన పనిష్మెంట్‌ను సానుభూతితో, మానవీయ కోణంలో కొట్టేయాలని కోరుతూ వరుణారెడ్డి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మే 30వ తేదీన అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం.. వరుణారెడ్డి దరఖాస్తుపై వేగంగా స్పందించింది. వరుణారెడ్డి కోరినట్టుగానే వాటిని కొట్టేస్తూ 2019 ఆగస్టు 29న ఉత్తర్వులిచ్చింది. 2008 నంబర్ 10 నుంచి 2010 ఫిబ్రవరి 7 వరకు వరుణారెడ్డి సస్పెషన్ కాలాన్ని కూడా డ్యూటీలోకి పరిగణిస్తున్నట్టుగా పేర్కొంది. 

జైళ్ల శాఖలో విశేష సేవలు అందించారని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదనల మేరకు కేంద్ర హోం శాఖ రిపబ్లి డే సందర్భంగా వరుణారెడ్డికి ‘మెడల్ ఫర్ మెరిటోరియ స్సర్వీస్‌’ను ప్రకటించింది.

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై శాఖపరమైన పనిష్మెంట్‌‌ను ఎదుర్కొంటున్న వ్యక్తిపై కరుణించడం, మెడల్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేయడం ద్వారా వైఎస్ జగన్ సర్కార్ ఉదారత చాటుకుంది. అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితులు రిమాండ్‌లో ఉన్న కడప జిల్లా జైలుకు వరుణారెడ్డిని ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా నియమించడంతో పాత అంశాలు చర్చనీయాంశంగా మారాయి. మీడియాలో ఈ విధమైన కథనాలు వెలువడం సంచలనంగా మారింది.

చంద్రబాబు సంచలన ఆరోపణలు..
మీడియాలో ఈ విధమైన కథనాలు వస్తున్న వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు చేసిన ఆరోపణలు సంచనలం రేపుతున్నాయి. శనివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులను అంతమొందించే కుట్రలో భాగంగానే వరుణ్‌రెడ్డిని కడప జైలుకు తీసుకొచ్చారని ఆరోపించారు. వరుణారెడ్డి జైలర్‌గా ఉన్నప్పుడే మొద్దు శీను హత్య  అనంతపురం జైల్లోనే జరిగిందని గుర్తు చేశారు. ప్రస్తుతం వివేకా హత్యకేసులో నిందితులు కడప జైలులో ఉన్నారని అన్నారు. వరుణారెడ్డిని అక్కడ నియమించడంతో వారికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. వైసీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని, ఇతర అధికార పార్టీ నేతలను కాపాడేందుకు ఈ కుట్రలన్నీ పక్కాగా జరుగుతున్నాయని ఆరోపించారు.

PREV
click me!

Recommended Stories

YS Jagan Birthday: తాడేపల్లి పార్టీ ఆఫీస్ లో ఘనంగా జగన్ బర్త్ డే వేడుకలు| Asianet News Telugu
Deputy CM Pawan Kalyan Speech: ఆరడుగుల బుల్లెట్ నేను కాదురఘురామ పై పవన్ పంచ్ లు | Asianet Telugu