విశాఖలో విషాదం... కొడుకును చితిపై చూసి ఆగిన తండ్రి గుండె

Arun Kumar P   | Asianet News
Published : Feb 13, 2022, 09:06 AM ISTUpdated : Feb 13, 2022, 09:15 AM IST
విశాఖలో విషాదం... కొడుకును చితిపై చూసి ఆగిన తండ్రి గుండె

సారాంశం

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు చేతికందివచ్చే సమయంలో మృతిచెందడాన్ని ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. కొడుకుకు అంత్యక్రియలు నిర్వహిస్తుండగా గుండెపోటుతో తండ్రి కూడా మృతిచెందిన విషాద ఘటన విశాఖలో చోటుచేసుకుంది.  

విశాఖపట్నం: అల్లారుముద్దుగా పెంచుకున్న తనయుడు తన కళ్లముందే చనిపోవడం ఆ తండ్రిని కలచివేసింది. చిన్నప్పుడు తన గుండెలపై పడుకున్న కొడుకు ఇప్పుడు చనిపోయి చితిపై పడివుండటాన్ని చూసి ఆ తండ్రి తట్టుకోలేకపోయాడు. దీంతో కొడుకు అంత్యక్రియలను నిర్వహిస్తూ ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. ఈ విషాద ఘటన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది.   

యారాడకు చెందిన బాయిన అప్పారావు ఉద్యోగం, పిల్లల చదువుల కోసం విశాఖపట్నంలోని మల్కాపురంలో నివాసముంటున్నారు. ఇతడికి ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి సంతాపం. పెద్దమ్మాయి పెళ్లయిపోగా ఇంకో కూతురు చదువుకుంటోంది. కొడుకు గిరీష్(22) ఏవియేషన్ కోర్సు చేసాడు.  

ఇలా అప్పారావు కుటుంబం ఏ చీకూచింతా లేకుండా హాయిగా జీవితం సాగుతోంది. అయితే రోజులన్నీ ఒకేలా వుండవు కదా... ఇన్నిరోజులు ఆనందంగా ఈ కుటుంబంలో ఒక్కసారిగా చీకట్లు కమ్ముకున్నారు. ఏవియేషన్ కోర్సు చేసిన గిరీష్ ఉద్యోగాన్వేషనలో వుండగా ఒక్కసారిగా అనారోగ్యం పాలయ్యాడు. దీంతో అతడిని కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. అయినా ఫలితంలేకుండా పోయింది. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. 

కొడుకు మృతి ఆ తల్లిదండ్రులకు తీవ్ర దు:ఖాన్ని కలిగించింది. తమకు తలకొరివి పెట్టి పున్నామనరకం నుండి కాపాడతాడని భావించిన కన్న కొడుకుకే తలకొరివి పెట్టాల్సి రావడంతో ఆ తండ్రి గుండె తట్టుకోలేకపోయింది. ఈ క్రమంలోనే కొడుకు గిరీష్ మృతదేహాన్ని చితిపై పడుకోబెట్టి చూట్టూ తిరుగుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయిన తండ్రి అప్పారావు స్మశానంలోనే కుప్పకూలిపోయాడు. ఇలా కొడుకు అంత్యక్రియలు నిర్వహిస్తూ తండ్రి కూడా మరణించాడు.  

ఒకేసారి కొడుకును, భర్తను కోల్పోయిన ఆ తల్లి బోరున విలపిస్తున్న తీరు అక్కడున్న అందరినీ కన్నీరు పెట్టించింది. సోదరుడితో పాటే తండ్రి కూడా మృతిచెందడంతో ఇద్దరమ్మాయిలు కంటతడి పెడుతుంటే ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఇలా తండ్రీకొడుకులు ఒకేసారి చనిపోవడం మల్కాపురంలో విషాదాన్ని నింపింది. 

గతేడాది కూడా ఇలాగే కొడుకు కరోనాతో మృతిచెందడంతో తట్టుకోలేక తండ్రి గుండెపోటుకు గురయి చనిపోయాడు. మాకవరపాలెం మండలం తమరం గ్రామానికి చెందిన ముల్లపూడి రాజారాం(58) సొంత గ్రామంలోనే  ప్రైమరీ టీచర్ గా పనిచేసేవాడు. అయితే ఇతడు కరోనా బారినపడి రిటైర్మెంట్ వయసులో మృతిచెందాడు. 

అయితే కొడుకు మరణాన్ని తట్టుకోలేకపోయిన సుబ్బారావు(86) ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతడిని హాస్పిటల్ కు తరలించే లోపే మృత్యువాతపడ్డాడు. ఇలా తండ్రికొడుకులు ఒకేరోజు మృతిచెందండం ఆ కుటుంబంలోనే కాదు గ్రామంలోనూ విషాదాన్ని నింపింది. 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నారావారిపల్లెలో CM Chandrababu Family గంగమ్మ, నాగాలమ్మకు ప్రత్యేక పూజలు | Asianet News Telugu
Andhra pradesh: కోటీశ్వ‌రుడిని చేసిన కోడి.. త‌ల‌రాత మార్చేసిన సంక్రాంతి పండ‌గ