విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: కార్మిక సంఘాల జైల్ భరో

Published : Feb 13, 2022, 09:35 AM ISTUpdated : Feb 13, 2022, 09:56 AM IST
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ:  కార్మిక సంఘాల జైల్ భరో

సారాంశం

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు కార్మిక సంఘాల జేఎసీ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు.  

విశాఖపట్టణం:  విశాఖపట్టణం Steel Plant ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం నాడు జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఫ్యాక్టరీ గేట్ ముందు కార్మిక సంఘాలు భారీ ఎత్తున  బైఠాయించి నిరసనకు దిగారు. కార్మిక సంఘాల  ఆందోళనకు ప్రజా సంఘాలు మద్దతు పలికాయి.

Visakha స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని  డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు గత ఏడాది ఫిబ్రవరి 12వ తేదీన కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఆందోళనను ప్రారంభించాయి. ఈ ఆందోళనకు ఏడాది పూరైంది. అయినా కేంద్రం మాత్రం ప్రైవేటీకరణ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెబుతుంది.  దీంతో ఇవాళ కార్మిక సంఘాలు తమ ఆందోళనను మరింత ఉధృథం చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. ఇందులో భాగంగానే కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో  ఇవాళ Jail bharo కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆందోళనలు ఏడాది పూర్తి చేసుకొన్న ఏడాదిని పురస్కరించుకొని శనివారం  నాడు 365 మంది కార్మికులు 365 జెండాలు పట్టుకొని ఆందోళనకు దిగారు. విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కేంద్ర ఆర్ధిక వ్యవహరాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిన తర్వాత కార్మిక సంఘాల జేఏసీ ఆందోళనకు దిగింది.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ పార్లమెంట్ లో ఎంపీల మద్దతు కూడగట్టేందుకు గాను కార్మిక సంఘాల బృందం న్యూఢిల్లీ వెళ్లనుంది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ బీజేపీ కార్యాలయం ముట్టడితో పాటు ఏపీ రాష్ట్ర బంద్‌కు పిలుపు నిర్వహించాలని జేఏసీ గతంలోనే ప్రకటించారు.  ఫిబ్రవరి 13న విశాఖలో ఉన్న బీజేపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చింది కమిటీ. ఫిబ్రవరి 23న విశాఖ నగరంతో పాటు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది.విశాఖలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం 150 మంది ప్రాణ త్యాగాలు చేశారని కార్మిక సంఘాల జేఏసీ నేతలు గుర్తు చేస్తున్నారు.  కరోనా వంటి పరిస్థితుల్లోనూ స్టీల్ ప్లాంట్‌కు రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని జేఏసీ నేతలు చెబుతున్నారు.. వచ్చే నెల 13వ తేదీ ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 365 జెండాలతో బీజేపీ కార్యాలయం ముట్టడిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు కోటి సంతకాల సేకరణ చేపట్టి 23వ తేదీ విశాఖతో పాటు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చినట్లు జేఏసీ గతంలోనే ప్రకటించింది. 

ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాది కాలంగా ఉద్యమం జరుగుతుంటే ' స్టీల్ ప్లాంట్ అమ్మేస్తాం.. లేదా తీసేస్తాం' అని కేంద్రం చెబుతుండటంతో దుర్మార్గమని జేఏసీ నేతలు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టిన పెట్టుబడి తప్ప బీజేపీ ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వలేదని  జేఏసీ నేత రాజశేఖర్ మండిపడ్డారు. కరోనా  సెకండ్ వేవ్ సమయంలో లిక్విడ్ ఆక్సిజన్ అందించి ఎంతోమంది ప్రాణాలను స్టీల్ ప్లాంట్ నిలిపిందని ఆయన గుర్తు చేశారు. దీపం పేరు పెట్టి ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయాలని అనుకున్నారో ఆ పథకంతోనే బీజేపీ  దీపం ఆరిపోవడం ఖాయమంటూ రాజశేఖర్ హెచ్చరించారు.
 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?