ఫోని తుఫాన్ పై వైఎస్ జగన్ ఆరా: అండగా ఉండాలని పార్టీ నేతలకు పిలుపు

By Nagaraju penumalaFirst Published May 3, 2019, 3:20 PM IST
Highlights

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నాయకులు ధర్మాన కృష్ణప్రసాద్, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, మాజీకేంద్రమంత్రి కిల్లికృపారాణిలతో స్వయంగా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని జగన్ కోరారు. అలాగే వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు.

హైదరాబాద్‌ : ఉత్తరాంధ్రను వణికిస్తున్న ఫోని తుఫాన్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. తుఫాన్ ప్రభావంపై ఎక్కడెక్కడ నష్టం జరిగింది, పార్టీ కార్యకర్తలు చేపట్టిన సహాయక కార్యక్రమాలపై ఆయన ఆరా తీశారు. 

శ్రీకాకుళం జిల్లాకు చెందిన పార్టీ నాయకులు ధర్మాన కృష్ణప్రసాద్, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, మాజీకేంద్రమంత్రి కిల్లికృపారాణిలతో స్వయంగా ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలవాలని జగన్ కోరారు. 

అలాగే వైసీపీ కార్యకర్తలకు, అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు. తుఫాన్ భారినపడిన గ్రామాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రజలకు భరోసా ఇవ్వాలంటూ కోరారు. ఇకపోతే తుఫాన్ ఒడిస్సాలో తీరం దాటినప్పటికీ శ్రీకాకుళం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. 

ఈ నేపథ్యంలో గురువారం రాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్థంభాలు కుప్పకూలిపోగా, మరికొన్ని చోట్ల విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. అలాగే పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 

click me!