లక్ష్మీస్ ఎన్టీఆర్ షో ఎఫెక్ట్ : థియేటర్ల లైసెన్స్ రద్దు, జేసీపై యాక్షన్

By Nagaraju penumalaFirst Published May 3, 2019, 3:00 PM IST
Highlights

తాజాగా ఈ సినిమా ఎఫెక్ట్ రెండు థియేటర్లపైనా, ఒక ఐఏఎస్ అధికారిపైనా పడింది. సినిమా విడుదల చేయోద్దన్న షో వేసినందుకు రెండు థియేటర్ల లైసెన్సులు రద్దు కాగా, ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఏకంగా ఐఏఎస్ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ఎన్నికల సంఘం. 

అమరావతి : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కిన లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో ఎంత అలజడి సృష్టించిందో అందరికి తెలిసింది. దివంగత సీఎం ఎన్టీఆర్, లక్ష్మీపార్వతిల జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలపై రాజకీయ రంగు పులుముకుంది. 

సినిమాను ఆపాలంటూ అధికార తెలుగుదేశం పార్టీ కోర్టులను సైతం ఆశ్రయించింది. సినిమాను విడుదల చేస్తే తప్పేంటంటూ వైసీపీ వర్మకు మద్దతు పలికింది. ఇలా ఒక సినిమాపై జరిగిన రాజకీయ రాద్ధాంతం అంతా ఇంతాకాదు. అయితే తాజాగా ఈ సినిమా ఎఫెక్ట్ రెండు థియేటర్లపైనా, ఒక ఐఏఎస్ అధికారిపైనా పడింది. 

సినిమా విడుదల చేయోద్దన్న షో వేసినందుకు రెండు థియేటర్ల లైసెన్సులు రద్దు కాగా, ప్రదర్శనను అడ్డుకోవడంలో విఫలమయ్యారంటూ ఏకంగా ఐఏఎస్ అధికారిపై చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది ఎన్నికల సంఘం. 

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉందని ఈ నేపథ్యంలో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను రిలీజ్ చేయోద్దని అలాగే ప్రదర్శనకు ఎలాంటి అనుమతులు ఇవ్వొద్దని సిఈవో ఆదేశాలు జారీ చేశారు. 

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ విడుదల చేయవద్దని ఆదేశాలు జారీచేసినప్పటికీ నిబంధనలకు విరుద్ధంగా కడప జిల్లాలోని రెండు థియేటర్లలో సినిమా ప్రదర్శించడంపై సిఈవో గోపాల కృష్ణ ద్వివేది ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిబంధనలకు విరుద్ధంగా సినిమాను ప్రదర్శించిన ఆ థియేటర్ల లైసెన్స్ లు రద్దు చెయ్యాలంటూ ఆదేశాలు జారీ చేశారు. 

అంతేకాదు సినిమా ప్రదర్శన అడ్డుకోలేకపోయిన కడప జిల్లా జాయింట్ కలెక్టర్ పై మండిపడ్డారు. ఎందుకు సినిమా విడుదలను అడ్డుకోలేకపోయారో చెప్పాలని వివరణ కోరారు. అంతటితో ఉపేక్షించని సిఈవో గోపాల కృష్ణ ద్వివేది  జాయింట్ కలెక్టర్ పై కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫారసు చేశారు.  

click me!