ఏపీలోని నాలుగు జిల్లాలకు ఊరట: కోడ్ ఎత్తివేత

Published : May 03, 2019, 01:04 PM IST
ఏపీలోని నాలుగు జిల్లాలకు ఊరట: కోడ్ ఎత్తివేత

సారాంశం

 ఫణి తుఫాన్ ‌కారణంగా  సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా నాలుగు జిల్లాల్లో  ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు ప్రకటించింది.

అమరావతి: ఫణి తుఫాన్ ‌కారణంగా  సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలను చేపట్టేందుకు వీలుగా నాలుగు జిల్లాల్లో  ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం నాడు ప్రకటించింది.

ఏపీ రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో కూడ ఫణి తుఫాన్ ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖాధికారులు హెచ్చరించారు.  దీంతో ఏపీలోని నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకొంది.

తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లాల్లో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేస్తున్నట్టుగా శుక్రవారం నాడు ఈసీ ప్రకటించింది.ఈసీ ఆదేశాలు తక్షణం అమల్లోకి రానున్నాయి. ఈ జిల్లాల్లో ప్రజలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకొన్నట్టుగా ఈసీ ప్రకటించింది.

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu