‘హోదా’ను తాకట్టు పెట్టిన చంద్రబాబు

First Published 10, Feb 2018, 1:40 PM IST
Highlights
  • 'విభజన చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించిందన్న విషయాన్ని జగన్ గుర్తుచేశారు.

స్వీయప్రయోజనాల కోసం చంద్రబాబునాయుడు ఏపి ప్రత్యేకహోదాను తాకట్టుపెట్టినట్లు వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో రెండు ట్వీట్లు పెట్టారు. 'విభజన చేసినప్పుడే ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్రం ప్రకటించిందన్న విషయాన్ని జగన్ గుర్తుచేశారు.

పార్లమెంట్‌ వేదికగా అప్పటి పాలక, విపక్షాలు కలిసి మాటిచ్చాయని తెలిపారు. మార్చి 2014లో ఇదే అంశాన్ని కేంద్రమంత్రి వర్గం ఆమోదించిందని చెప్పారు. ప్రత్యేక హోదా అమలు అంశాన్ని ప్రణాళికా సంఘానికి పంపిన విషయం చంద్రబాబుకు గుర్తులేదా అంటూ నిలదీశారు.

ఏ నైతిక విలువలతో చంద్రబాబు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారో చెప్పాలంటూ ధ్వజమెత్తారు. ఏమిస్తారో తెలియని ప్రత్యేక ప్యాకేజీ కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెడతారా? అంటూ మండిపడ్డారు. ‘మీ కంటి తుడుపు చర్యలు ఆపి ఏపీ ప్రజలకు ఏం చేశారో చెప్పండి' అని జగన్‌ ప్రశ్నించారు.

Last Updated 25, Mar 2018, 11:51 PM IST