పాదయాత్రలు: వైఎస్ ఫ్యామిలిదే రికార్డు

First Published Oct 16, 2017, 11:18 AM IST
Highlights
  • పాదయాత్రలకు సంబంధించి రాజకీయ కుటుంబాల్లో వైఎస్ ఫ్యామిలిదే రికార్డు అయ్యేట్లుంది.
  • ఇప్పటి వరకూ రాష్ట్రచరిత్రలో ముగ్గురు పాదయాత్ర చేస్తే అందులో ఇద్దరు వైఎస్ కుంటుంబ సభ్యులే కావటం గమనార్హం.
  • నాలుగో వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నవంబర్ 2వ తేదీ నుండి మహా పాదయాత్రకు రెడీ అవుతున్నారు.
  • అంటే జగన్ పాదయాత్ర కూడా మొదలైతే వైఎస్ ఫ్యామిలి నుండి ముగ్గరు పాదయాత్రలో పాల్గొన్నట్లవుతుంది. 

పాదయాత్రలకు సంబంధించి రాజకీయ కుటుంబాల్లో వైఎస్ ఫ్యామిలిదే రికార్డు అయ్యేట్లుంది. ఇప్పటి వరకూ రాష్ట్రచరిత్రలో ముగ్గురు పాదయాత్ర చేస్తే అందులో ఇద్దరు వైఎస్ కుంటుంబ సభ్యులే కావటం గమనార్హం. నాలుగో వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నవంబర్ 2వ తేదీ నుండి మహా పాదయాత్రకు రెడీ అవుతున్నారు. అంటే జగన్ పాదయాత్ర కూడా మొదలైతే వైఎస్ ఫ్యామిలి నుండి ముగ్గరు పాదయాత్రలో పాల్గొన్నట్లవుతుంది. 

2004కు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ట్రచరిత్రలో మొదటిసారిగా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో పార్టీలో వైఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకోవాల్సిన పరిస్ధితి. అందుకు పాదయాత్రనే సరైన మార్గంగా భావించారు. వెంటనే రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ళ నుండి శ్రీకాకుళం జిల్లా వరకూ పాదయాత్ర చేసారు. రాష్ట్రానికి సంబంధించినంత వరకూ అప్పట్లో అదొక సంచలనం. సరే, పాదయాత్ర తర్వాత వైఎస్ ఇమేజ్ ఎంత పెరిగిందో తర్వాత జరిగిన పరిణామాలన్నీ అందరికీ తెలిసినవే.

2014 ఎన్నికలకు ముందు అధికారమే లక్ష్యంగా చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేసారు. మధ్యలో కొన్ని చోట్ల బస్సులో కూడా ప్రయాణించినా మొత్తం మీద పాదయాత్ర చేసినట్లే లెక్క. అంతకుముందు వైఎస్ కూతురు షర్మిల కూడా పాదయాత్ర చేసారు. వైఎస్, చంద్రబాబుల కన్నా వయసులో చిన్నదే కాబట్టి సులువుగానే పాదయాత్రను పూర్తి చేసారు షర్మిల. సరే, మొదటిసారిగా పాదయాత్ర చేసిన వైఎస్, తర్వాత పాదయాత్ర చేసిన చంద్రబాబు ఇద్దరు కూడా తర్వాత ముఖ్యమంత్రులయ్యారు. అయితే, షర్మిల మాత్రం రాజకీయంగా తెరవెనక్కు వెళ్ళిపోయారు.

ఇక, ప్రస్తుతానికి వస్తే, నవంబర్ 2వ తేదీ నుండి వైఎస్ జగన్ పాదయాత్రకు సన్నాహాలు పూర్తి చేసుకున్నారు.  కోర్టు కేసుల్లో విచారణ కారణంగా ప్రతీ శుక్రవారం  స్వయంగా జగన్ కోర్టుకు హాజరవ్వాలి.  ప్రస్తుతానికి అదొక్కటే అడ్డంకిగా మారింది. దానిపై ఈనెల 20వ తేదీన కోర్టులో విచారణ జరుగుతుంది. వ్యక్తిగత హాజరునుండి కోర్టు మినహాయింపు ఇచ్చినా ఇవ్వకపోయినా పాదయాత్ర చేసి తీరాల్సిందే అని జగన్ తీర్మానించుకున్నారు. అందుకు తగ్గట్లే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయనుకోండి. అందుకే పాదయాత్రల్లో వైఎస్ ఫ్యామిలీ రికార్డు సృష్టించినట్లే.

click me!