‘నారాయణ’  నరక కూపాలు’..మూసేయండి....విద్యార్ధిని అదృశ్యం

First Published Oct 16, 2017, 6:17 AM IST
Highlights
  • వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాసారని కాదు కానీ రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యా సంస్ధల్లో పరిస్ధితి చాలా దారుణంగా ఉంది.
  • గడచిన మూడున్నరేళ్ళలో సుమారు 40 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారంటేనే పరిస్ధితి ఎలా ఉందో ఎవరికైనా అర్ధమైపోతుంది.
  • ఇప్పటివకూ జరిగిన ఆత్మహత్యల్లో నారాయణ, శ్రీ చైతన్య కళాశాల వాటానే అత్యధికం.
  • తాజాగా హైదరాబాద్ లోని రాచకొండ మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో ఓ విద్యార్ధి లేఖపెట్టి మరీ అదృశ్యమైపోవటం ఇపుడు సంచలనంగా మారింది.

‘నారాయణ కళాశాలలు విద్యార్ధుల పాలిట నరక కూపాలుగా మారాయ్’...దయచేసి నారాయణ విద్యాసంస్ధలను మూసేయించండి’..

‘కళాశాలలో చదువుకోవటం ఇష్టం లేక, వాళ్ళు పెడుతున్న ఒత్తిడి తట్టుకోలేక తాను వెళ్ళి పోతున్నా’..ఇది తాజాగా నారాయణ కాలేజి విద్యార్ధిని రాసిన లేఖ.

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాసారని కాదు కానీ రాష్ట్రంలోని కార్పొరేట్ విద్యా సంస్ధల్లో పరిస్ధితి చాలా దారుణంగా ఉంది. గడచిన మూడున్నరేళ్ళలో సుమారు 40 మంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారంటేనే పరిస్ధితి ఎలా ఉందో ఎవరికైనా అర్ధమైపోతుంది. ఇప్పటివకూ జరిగిన ఆత్మహత్యల్లో నారాయణ, శ్రీ చైతన్య కళాశాల వాటానే అత్యధికం. తాజాగా హైదరాబాద్ లోని రాచకొండ మేడిపల్లి పోలీసు స్టేషన్ పరిధిలోని బండ్లగూడ నారాయణ కాలేజీలో ఓ విద్యార్ధి లేఖపెట్టి మరీ అదృశ్యమైపోవటం ఇపుడు సంచలనంగా మారింది.

నారాయణ కాలేజీలో చదువుతున్న విద్యార్ధి సాయి ప్రజ్వల ఈనెల 11వ తేదీన ఓ లేఖరాసింది. కాలేజీలోని పరిస్ధితులను కళ్ళకు కట్టినట్లు లేఖలో రాసింది. ప్రజ్వల రాసిన లేఖ ఇపుడు రెండు రాష్ట్రాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. లేఖలోనే ఆ విధంగా ఉందంటే వాస్తవ పరిస్ధితిలు ఇంకెంత దారుణంగా ఉంటుందో ఎవరికి వారు అంచనా వేసుకోవచ్చు.

అసలు ఈ పరిస్ధితి ఎందుకు వచ్చింది ? అంటే, అందుకు కారణం ప్రభుత్వ వైఫల్యమని చెప్పక తప్పదు.  మూడున్నరేళ్ళుగా పై కళాశాలల్లో ఎంతమంది చనిపోయినా ప్రభుత్వం పరంగా ఒక్క చర్యకూడా తీసుకోలేదు. ఎందుకంటే, నారాయణ, శ్రీ చైతన్య కళాశాలలు టిడిపి నేతలవన్న విషయం అందరికీ తెలిసిందే. పోయిన ఎన్నికల్లో చంద్రబాబునాయుడును అన్నీ విధాలుగా ఆదుకున్నందుకు నారాయణ కళాశాలల యాజమాని నారాయణను ఎంఎల్సీని చేసి ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.

పైగా నారాయణకు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు. ఇక చెప్పేదేముంది ? వీరిద్దరిపై చంద్రబాబు అన్నీ విధాలుగాను ఆధారపడ్డారు. పైగా ఇద్దరూ ఆర్ధికంగా బాగా పటిష్టమైన స్ధితిలో ఉండటమే కాకుండా కాపు సామాజికవర్గంలో కూడా ప్రముఖులే. దాంతో పై కళాశాలల్లో ఏమి జరిగినా చంద్రబాబుకు  వినబడదు, కనబడదు. దాంతో రెండు కళాశాలల యాజమాన్యాలు రెచ్చిపోతున్నాయ్. దాని ఫలితమే విద్యార్ధుల ఆత్మహత్యలు, పారిపోవటాలు.

ఆ విషయాన్నే జగన్మోహన్ రెడ్డి శనివారం లేఖలో పేర్కొన్నారు. ‘మీ మంత్రుల కళాశాలల్లోనే విద్యార్ధుల ఆత్మహత్యలు..ఏమిటిది చంద్రబాబు గారూ ? అంటూ జగన్ ప్రశ్నించటంలో తప్పేంటి ? ‘ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్ధుల తల్లి, దండ్రుల కడుపుకోత కూడా కదిలించటం లేదంటే ఎంత ఘోరం చంద్రబాబు గారూ’ అన్న ఆవేదనలో అర్ధముంది. ఇప్పటికైనా చంద్రబాబు స్పందిచకపోతే కాలమే తెలిసేట్లు చెబుతుంది.

click me!