వివేకా హత్య కేసు : తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి..

Published : Mar 20, 2023, 12:59 PM IST
వివేకా హత్య కేసు : తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి..

సారాంశం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ4గా ఉన్న దస్తగిరిని అప్రూవర్ గా సీబీఐ ప్రకటించడం మీద వైఎస్ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   

హైదరాబాద్ : వివేక హత్య కేసు తెలంగాణ హైకోర్టులో విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో ఏ ఫోర్ దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడానికి సవాలు చేస్తూ తెలంగాణ హైకోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ వేశారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగానే వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి,  అవినాష్ రెడ్డిలను సిబిఐ విచారించింది. ఈ నేపథ్యంలోనే వైయస్ భాస్కర్ రెడ్డి దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించడానికి వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఈ పిటిషన్ లో ఆయన.. ‘సిబిఐ చెప్పినట్లుగానే దస్తగిరి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. దస్తగిరిని అప్రూవర్ గా ప్రకటించి, అతని స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని ఈ నేరంలోకి నెట్టడం సరైనది కాదు. దస్తగిరి  వివేకానంద రెడ్డి హత్యకేసులో కీలక పాత్ర పోషించాడు. అలాంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వడం సరికాదు. వివేక హత్య కేసులో కీలకంగా మారిన ఆయుధాన్ని కొనుగోలు చేసింది కూడా దస్తగిరినే. సిబిఐ దస్తగిరికి బెయిల్ సమయంలో కూడా సహకరించింది. కింది కోర్టు దస్తగిరిపై ఉన్న ఆధారాలను పట్టించుకోలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని దస్తగిరికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలి’  అని భాస్కర్ రెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు.

దారుణం.. ప్రియురాలు బైక్ పై తిరుగుతోందని.. నచ్చక ప్రియుడి ఆత్మహత్యాయత్నం..

ఇదిలా ఉండగా, వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మార్చి 9న తెలంగాణ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు హాజరుకావాలని సీబీఐ సమన్లు జారీ చేసిందని తెలుపుతూ..  దీనిమీద తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని పిటిషన్ లో పేర్కొన్నారు. వీటితోపాటు పిటిషన్ లో ఆయన అనేక కీలక విషయాలను కూడా చేర్చారు. వైయస్ వివేకా కూతురు సునీతకు,  వివేకాకు మధ్య తీవ్ర మనస్పర్ధలు ఉన్నాయని తెలిపారు. ఈ మేరకు ఆయన వివరాలు తెలుపుతూ.. 

‘ వైఎస్ వివేకానంద రెడ్డి 2010లో షేక్ షమీమ్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. వీరికి 2015లో ఓ కుమారుడు కూడా పుట్టాడు. ఆ తర్వాత నుంచే వివేకా కుటుంబంలో తీవ్ర విభేదాలు నెలకొన్నాయి.  వివేకా రెండో భార్య షమీమ్ ను .. వివేకా కూతురు సునీత, ఆమె భర్త ఎస్ రాజశేఖర్ రెడ్డి, బావ ఎన్ శివప్రకాశ్ రెడ్డి శత్రువుగా చూసేవారు. పలు కంపెనీలో డైరెక్టర్ గా సునీత రాజశేఖర్ రెడ్డిలతో పాటు వివేకానంద రెడ్డి కూడా ఉన్నారు. ఈ విభేదాల కారణంగానే వారు ఆ కంపెనీలో  వివేకానంద రెడ్డి చెక్ పవర్ ను రద్దు చేశారు. వివేకానంద రెడ్డి ఈ కారణంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

వివేకానంద రెడ్డి మొదటి భార్య, కూతురు హైదరాబాదులో ఉండేవారు వివేకానంద్ రెడ్డి మాత్రం ఎక్కువగా పులివెందులలోనే గడిపేవారు. ఈ క్రమంలోనే ఒక దశలో షమీమ్ కుమారుడినే వివేకానంద రెడ్డి తన వారసుడిగా ప్రకటిస్తారని ఊహాగానాలు వెలుపడ్డాయి. ఈ మేరకు విల్లు కూడా రాశారని పుకార్లు పుట్టాయి. వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత ఏ1నుంచి ఏ4వరకు ఉన్న నిందితుల ఇళ్లలో ఈ పత్రాల కోసం వెతికినట్లు కూడా తెలుస్తోంది. సొంత కుటుంబసభ్యులే దీనికి పాల్పడి ఉంటారని వీటిని పరిశీలిస్తుంటే తెలుస్తోంది. 

ఆయనని వదిలించుకోవడానికి పథకం ప్రకారం ఈ పనికి పూనుకున్నట్లుగా అర్థమవుతుంది. వివేకానంద రెడ్డి హత్య తర్వాత షమీమ్ దర్యాప్తులో మాట్లాడుతూ సునీత, ఆమె కుటుంబ సభ్యులు బెదిరించినట్లుగా తెలిపారు. వివేకానంద రెడ్డి తన కుమారుడి పేరుమీద రెండు కోట్లు బ్యాంకులో డిపాజిట్ చేస్తానన్నారని చెప్పుకొచ్చారు’  అని అవినాష్ రెడ్డి పిటిషన్ లోతెలిపారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?