దారుణం.. ప్రియురాలు బైక్ పై తిరుగుతోందని.. నచ్చక ప్రియుడి ఆత్మహత్యాయత్నం..

Published : Mar 20, 2023, 11:45 AM IST
దారుణం.. ప్రియురాలు బైక్ పై తిరుగుతోందని.. నచ్చక ప్రియుడి ఆత్మహత్యాయత్నం..

సారాంశం

తన ప్రియురాలు బైక్ మీద తిరగడం నచ్చని ఓ ప్రియుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. 

కృష్ణాజిల్లా : మహిళల మీద జరుగుతున్న దాష్టీకాలకు ఇదో పరాకాష్ట.  ప్రేమించినంత మాత్రాన తాము చెప్పినట్టే వినాలని.. పొసెసివ్ గా ఉండే  పురుషుల మనస్తత్వానికి అద్దం పట్టే ఘటన. ప్రియురాలు బైక్ మీద తిరగడానికి జీర్ణించుకోలేకపోయిన ఓ ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఆశ్చర్యంగా అనిపించే ఈ ఘటన కృష్ణాజిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. ప్రియురాలు తన కళ్ళ ఎదుటే టు వీలర్ నడపడాన్ని  సదరు ప్రియుడు జీర్ణించుకోలేకపోయాడు. తనకు అలా తిరగడం ఇష్టం లేదని ఆమెని వారించాడు. కానీ, ఆమె వినలేదు. 

దీంతో మనస్థాపం చెందిన ప్రియుడు ఆమె ఇంటి వద్దకు వెళ్లి ఒంటి మీద పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. బవర్ సింగ్ అనే వ్యక్తి కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని మార్వాడి గుడి సమీపంలో ఉంటాడు. గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ బయట టీ షాప్ ఉంది. బవర్ సింగ్ రెండో కొడుకు శైలేష్ సింగ్ (26). అతను అదే పట్టణానికి చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఇటీవల ఆమె ద్విచక్ర వాహనం కొనుక్కుంది. ఆ బండి మీద ఆమె పట్టణంలో తిరగడం శైలేష్ సింగ్ కి నచ్చలేదు. ఈ విషయాన్ని శైలేష్ సింగ్..  ఆ యువతికి చెప్పాడు. కానీ ఆమె వినలేదు. దీంతో శైలేష్ సింగ్  తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. స్పీకర్‌పై టీడీపీ సభ్యులు దాడి చేశారు.. అడ్డుకునేందుకు వెళితే తోసేశారు: వైసీపీ ఎమ్మెల్యేలు

ఆదివారం సాయంత్రం తన ప్రియురాలు ఇంటి దగ్గరికి వెళ్ళాడు.  నువ్విలా టు వీలర్ మీద ఊరికే అటు, ఇటు తిరుగుతుంటే నేను తట్టుకోలేను.. చనిపోతానని ఆమెను బెదిరించాడు. దీంతో చిరాకు వచ్చిన ఆమె నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో అని బదిలిచ్చింది. శైలేష్ సింగ్ మనస్థాపానికి గురయ్యాడు. అక్కడి నుంచి నేరుగా ప్రియురాలు ఇంటి మీద నివసిస్తున్న వారి ఇంటికి వెళ్ళాడు.  అక్కడ ఒంటిపై  పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతడి మంటలు ఆర్పి.. 108 సహాయంతో గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.  

అయితే అప్పటికే దాదాపు 90% పైగా శరీరం కాలిపోయి ఉండడంతో శైలజ సింగ్ పరిస్థితి విషమించింది.  దీంతో న్యాయమూర్తి అతని మరణ వాంగ్మూలాన్ని సేకరించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కోసం శైలేష్ సింగ్ ను  మచిలీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. 

PREV
click me!

Recommended Stories

APSPDCL రిక్రూట్‌మెంట్ 2026: నెలకు 2 లక్షల వరకు జీతంతో విద్యుత్ శాఖలో ఉద్యోగాలు
కూటమిపై జగన్ సంచలన కామెంట్స్ | YS Jaganmohan Reddy Pressmeet | CM Chandrababu | Asianet News telugu