వివేకా కేసు.. సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ భాస్కర్ రెడ్డి, రేపే విచారణ

By Siva KodatiFirst Published Jun 1, 2023, 7:09 PM IST
Highlights

వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. రేపు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారించనుంది. 
 

ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఈ నెల 30 నాటికి వివేకా కేసు విచారణను ముగించాలని సుప్రీంకోర్ట్ ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ అధికారులు వేగంగా స్పందిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్ట్ ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి సైతం సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. గత నెల 16 నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లోనే వున్నారు భాస్కర్ రెడ్డి. రేపు ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారించనుంది. 

ALso Read: అవినాష్ రెడ్డి తల్లి సర్జరీపై తప్పుడు సమాచారం.. చర్యలు తీసుకోండి: హైకోర్టులో సునీత మెమో

భాస్కర్ రెడ్డి గత శుక్రవారం అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. వైఎస్ భాస్కర్ రెడ్డికి బీపీ తగ్గడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. అయితే వైఎస్ భాస్కర్ రెడ్డికి ప్రత్యేక చికిత్స అవసరమని ఉస్మానియా ఆస్పత్రి వైద్య సిబ్బంది గుర్తించి నిమ్స్‌కు తరలించాలని సూచించారు. ఇక అరెస్ట్ సందర్భంగా సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డికి సంబంధించి కీలక అంశాలను ప్రస్తావించారు. కేసును ప్రభావితం చేయడం, విచారణకు సహకరించకపోవడం వంటి పనులు చేశారని సీబీఐ ఆరోపించింది. వైఎస్ వివేకాపై భాస్కర్ రెడ్డి కుటుంబం తీవ్ర అసంతృప్తితో వుందని పేర్కొంది. ఇక వివేకా హత్య జరిగిన ప్రదేశంలో సాక్ష్యాధారాలను చెరిపివేయడం వెనుక భాస్కర్ రెడ్డి ప్రమేయం వుందని సీబీఐ ఆరోపించింది.

click me!