తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద విషాదం.. కుప్పకూలిన వందల ఏళ్ల నాటి మర్రిచెట్టు, ఒకరి మృతి

Siva Kodati |  
Published : Jun 01, 2023, 06:51 PM IST
తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం వద్ద విషాదం.. కుప్పకూలిన వందల ఏళ్ల నాటి మర్రిచెట్టు, ఒకరి మృతి

సారాంశం

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం ముందు వున్న భారీ మర్రి చెట్టు కుప్పకూలింది.  ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురు భక్తుల పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది.

తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం ముందు వున్న భారీ మర్రి చెట్టు కుప్పకూలింది.  ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ముగ్గురు భక్తుల పరిస్థితి విషమంగా వున్నట్లుగా తెలుస్తోంది. ఈ చెట్టు కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడ వుందని స్థానికులు చెబుతున్నారు. గురువారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీయడంతో చెట్టు ఉన్నట్లుండి కుప్పకూలింది. క్షతగాత్రులను హుటాహుటిన రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అయితే బ్రేక్ సమయం కావడంతో అంతగా జనం లేరు. లేనిపక్షంలో భారీ ప్రమాదం సంభవించేదని సిబ్బంది చెబుతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

BR Naidu Press Meet: దేశం లోనే అత్యుత్తమ ఆసుపత్రిగా తిరుపతి స్విమ్స్: బీఆర్ నాయుడు| Asianet Telugu
Swathi Deekshith & Pranavi Manukonda Visit Tirumala Temple: శ్రీవారిసేవలో ప్రముఖులు | Asianet Telugu