ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ అభిషేక్‌రెడ్డి.. పులివెందుల బాధ్యతలు అప్పగించనున్న వైసీపీ..! ఇంతకీ ఆయన ఎవరంటే ?

Published : May 18, 2023, 09:04 AM IST
ప్రత్యక్ష రాజకీయాల్లోకి వైఎస్ అభిషేక్‌రెడ్డి.. పులివెందుల బాధ్యతలు అప్పగించనున్న వైసీపీ..! ఇంతకీ ఆయన ఎవరంటే ?

సారాంశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీప బంధువు అయిన వైఎస్ అభిషేక్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నట్టు తెలుస్తోంది. బుధవారం వైఎస్ అవినాష్‌రెడ్డి తో కలిసి ఆయన నియోజకవర్గంలో పర్యటించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.   

వైఎస్‌ అభిషేక్‌రెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే సాంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంత కాలం ఆయన రాజకీయాల్లో తెర వెనుక మాత్రమే ఉన్నారు. అయితే ఒక్క సారిగా బుధవారం ప్రజల్లోకి వచ్చి, ఓ రాజకీయ పర్యటనలో కనిపించారు. కడప ఎంపీగా ఉన్న వైఎస్‌ అవినాష్‌రెడ్డి బుధవారం పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో పర్యటించారు. ఆయన వెంట అభిషేక్ రెడ్డి కనిపించారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.

సీఎం వైఎస్ జగన్ వేసుకునే చెప్పుల ధర రూ.1,34,800.. పెన్ను ధర రూ.1 లక్ష - టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి

అభిషేక్ రెడ్డి.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి దగ్గరి బంధువు అవుతారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనకు వైసీపీ పులివెందుల బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. వైఎస్ అభిషేక్ రెడ్డి ఓ డాక్టర్. ఆయన విశాఖపట్నంలో తన వృత్తిని కొనసాగిస్తున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నాన్న అయిన భాస్కరరెడ్డి సోదరుడి ప్రకాశ్‌రెడ్డికి అభిషేక్ రెడ్డి మనవడు అవుతారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారని చర్చ జరుగుతోంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert: మ‌ళ్లీ దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. ఏపీలో ఈ ప్రాంతాల‌కు అల‌ర్ట్
RK Roja on CM Chandrababu: రేవంత్ రెడ్డి కి ఎందుకు భయపడుతున్నావ్? | YSRCP | Asianet News Telugu