ప్రేమించిన యువతి వరస కాదు అని చెప్పారని...!

Published : Aug 09, 2021, 10:50 AM IST
ప్రేమించిన యువతి వరస కాదు అని చెప్పారని...!

సారాంశం

ఆ అమ్మాయి వరస కాదని.. ప్రేమ చంపుకోవాలని కుటుంబ సభ్యులు సూచించారు. అయితే.. ఆ అమ్మాయిని మర్చిపోవడం ఇష్టంలేక.. ఏకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు.

ఓ  యువకుడు తమ సమీప బంధువు ఓ అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. అదే విషయాన్ని కుటుంబసభ్యులకు కూడా చెప్పాడు. అయితే..  ఆ అమ్మాయి వరస కాదని.. ప్రేమ చంపుకోవాలని కుటుంబ సభ్యులు సూచించారు. అయితే.. ఆ అమ్మాయిని మర్చిపోవడం ఇష్టంలేక.. ఏకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కలికిరి మండలంలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కొర్నమిట్టపల్లెకు చెందిన సుబ్బరాజ కుమారుడు కే.అశోక్‌ బాబు(23) తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఈసీజీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. స్వగ్రామంలో తన సమీప బంధువుల అమ్మాయిని కొంతకాలంగా ప్రేమించాడు.

ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు ఆ అమ్మాయితో నీకు వరుసలేదని, వద్దని మందలించారు. దీంతో మూడు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లిపోయాడు. కొర్లకుంట గ్రామం టి.మాదిగపల్లె సమీపంలోని అటవీప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెందినట్లు ఆదివారం గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా మృతుడు అశోక్‌బాబుగా గుర్తించారు. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు. వారు ఆత్మహత్యకు పాల్పడిందని తమ కుమారుడేనని చూసి గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు తండ్రి సుబ్బరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

PREV
click me!

Recommended Stories

ఆ నీచానికి ఒడిగట్టింది మీరే | Perni Nani Fires On Chandrababu | Asianet Telugu
Earthquake: విశాఖను వణికించిన భూకంపం.. ఏపీ, తెలంగాణలో ఏయే ప్రాంతాలు డేంజర్ జోన్ లో ఉన్నాయి?