వివాహేతర సంబంధం అనుమానం.. భార్యను కిరాతకంగా గొంతుకోసిన భర్త..

Published : Aug 09, 2021, 10:37 AM IST
వివాహేతర సంబంధం అనుమానం.. భార్యను కిరాతకంగా గొంతుకోసిన భర్త..

సారాంశం

కొటికలపూడి నరసింహం, రమణమ్మ(47) భార్యభర్తలు. నరసింహం ప్రతిరోజు మద్యం తాగొచ్చి వివాహేతర సంబంధం పెట్టుకుంటుందనే అనుమానంతో భార్యను చిత్రవధ చేసేవాడు. ఈ నేపత్యంలో ఆదివారం తెల్లవారుజామున భార్యతో గొడవకు దిగి తీవ్ర ఆగ్రహంతో ఆమె జుట్టు పట్టుకుని కత్తితో గొంతు కోశాడు. 

ప్రకాశం : వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో భార్య గొంతు కోసి కిరాతకంగా హతమార్చాడో భర్త. ఈ ఘటన లింగసముద్రం మండలంలోని అన్నెబోయినపల్లెలో ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... 

కొటికలపూడి నరసింహం, రమణమ్మ(47) భార్యభర్తలు. నరసింహం ప్రతిరోజు మద్యం తాగొచ్చి వివాహేతర సంబంధం పెట్టుకుంటుందనే అనుమానంతో భార్యను చిత్రవధ చేసేవాడు. ఈ నేపత్యంలో ఆదివారం తెల్లవారుజామున భార్యతో గొడవకు దిగి తీవ్ర ఆగ్రహంతో ఆమె జుట్టు పట్టుకుని కత్తితో గొంతు కోశాడు. రమణమ్మ కేకలు విని చుట్టుపక్కల వారు ఇంటి వద్దకు చేరుకున్నారు. 

అప్పటికే ఆమె మరణించడంతో భర్త అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కందుకూరు డీఎస్పీ కండె శ్రీనివాసులు, సీఐ శ్రీరాం, గుడ్లూరు ఎస్సై మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.  

పరారీలో ఉన్న నరసింహాన్ని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. రమణమ్మను తానే హతమార్చినట్లు ఒప్పుకొన్నాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరికి నలుగురు అబ్బాయిలు. ఇద్దరికి వివాహం కాగా.. మరో ఇద్దరు హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్