మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..!

Published : Aug 09, 2021, 08:43 AM ISTUpdated : Aug 09, 2021, 08:51 AM IST
మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..!

సారాంశం

టూటౌన్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుకన్య ఆదివారం వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

చెట్టుకు ఉరివేసుకొని ఓ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం, కార్తికేయపురానికి చెందిన  సుకన్య అనే యువతి మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తోంది. తిరుమల టూటౌన్‌ పీఎస్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న సుకన్య ఆదివారం వ్యవసాయ పొలంలోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సుకన్య ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే కారణమని అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఉన్నతాధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్