ప్రకాశం జిల్లాలో దారుణం... బహిర్భూమికి వెళ్లిన యువతిని అపహరించి అత్యాచారం

Arun Kumar P   | Asianet News
Published : Jul 14, 2021, 10:33 AM IST
ప్రకాశం జిల్లాలో దారుణం... బహిర్భూమికి వెళ్లిన యువతిని అపహరించి అత్యాచారం

సారాంశం

బహిర్భూమికి వెళ్లిన యువతి అత్యాచారానికి గురయిన దారుణం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు యువతిని కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఒంగోలు: బహిర్భూమికి వెళ్లిన యువతి అత్యాచారానికి గురయిన దారుణం ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. ఇద్దరు యువకులు ఒంటరిగా వున్న యువతిని ఎత్తుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఈ దారుణానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం ఆవులమంద గ్రామానికి చెందిన ఓ ఇంట్లో మరుగుదొడ్డి లేదు. దీంతో ఆ ఇంట్లో కుటుంబంతో కలిసి నివాసముండే యువతి ప్రతిరోజూ గ్రామశివారులో బహిర్భూమికి వెళ్లేది. ఈ విషయాన్ని గమనించిన ఇద్దరు యువకులు ఆ యువతిపై దారుణానికి ఒడిగట్టారు. 

read more  మహిళా వాలంటీర్ల వేధింపులు... ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

యువతి ఒంటరిగా బహిర్భూమికి వెళ్ళగా ఆమెను బైక్ పై ఫాలో అయ్యారు యువకులు. ఈ క్రమంలోనే యువతిని బలవంతంగా బైక్ పై ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఓ యువకుడు యువతిపై అత్యాచారానికి పాల్పడగా మరొకరు కాపలాగా నిల్చున్నాడు.  

ఇంటికి చేరుకున్న తర్వాత యువతి తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో యువతిని అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?