నా పేరుతో నకిలీ మందులు: ఆనందయ్య సంచలనం

Published : Jul 14, 2021, 09:54 AM IST
నా పేరుతో నకిలీ మందులు: ఆనందయ్య సంచలనం

సారాంశం

నెల్లూరు జిల్లాకు చెందిన ఆనందయ్య పంపిణీ చేసే కరోనా మందుకు తెలుగు రాష్ట్రాల్లో మంచి డిమాండ్ ఉంది.  తన పేరున నకిలీ మందులు సరఫరా చేస్తున్నారని ఈ విషయమై అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

నెల్లూరు: కొందరు తన పేరున నకిలీ మందు తయారు చేసి విక్రయిస్తున్నారని ఆనందయ్య చెప్పారు. నకిలీ మందుల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన ప్రజలకు సూచించారు.జిల్లాలోని  చిట్టమూరు మండలం మల్లాలలోని సుబ్రమణ్యేశ్వరస్వామి ఆలయాన్ని ఆనందయ్య మంగళవారం నాడు సందర్శించారు.ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం  ఆయన కరోనా నివారణ మందును పంపిణీ చేశారు. 

అన్ని ప్రాంతాలకు తన మందు చేరిందన్నారు. తన మందును అన్ని ప్రాంతాలకు చేరేలా సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.  తన పేరున విక్రయించే నకిలీ మందు వికటిస్తే తాను బాధ్యుడిని కానని ఆయన చెప్పారు. ఈ విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 

ఆనందయ్య మందు  కోసం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున డిమాండ్ నెలకొన్న విషయం తెలిసిందే. ఆనందయ్య పంపిణీ చేసే  కంట్లో వేసే చుక్కల మందు హనికరమని ల్యాబ్ రిపోర్టులు ప్రభుత్వానికి నివేదికను అందించాయి. దీంతో చుక్కల మందు పంపిణీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది.
 

PREV
click me!

Recommended Stories

AP Food Commission Warning at NTR District | “మీ ఉద్యోగం పోతుంది చూసుకోండి” | Asianet News Telugu
IMD Rain Alert : శ్రీలంక సమీపంలో ఆవర్తనం... ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షాలు