ముచ్చటగా మూడు పెళ్లిళ్లు: తిరుపతిలో నిత్య పెళ్లి కూతురు అరెస్ట్

By narsimha lodeFirst Published Jul 14, 2021, 10:31 AM IST
Highlights

నిత్య పెళ్లికూతురు సుహాసినిని తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు, కొత్తగూడెం, తిరుపతిలకు చెందిన ముగ్గురిని సుహాసిని పెళ్లి చేసుకొంది. మూడో భర్త సునీల్ ఫిర్యాదు మేరకు మూడు పెళ్లిళ్ల విషయం వెలుగు చూసింది. 
 

తిరుపతి:  అనాధగా చెప్పుకొని పెళ్లిళ్లు చేసుకొని అత్తింటి నుండి డబ్బు, నగలతో పారిపోయిన నిత్య పెళ్లికూతురు సుహాసినిని తిరుపతి పోలీసులు బుధవారం నాడు అరెస్ట్ చేశారు. ఇప్పటికే సుహాసిని మూడు పెళ్లిళ్లు చేసుకొంది. నిత్య పెళ్లి కూతురు వ్యవహరం ఈ ఏడాది జూన్ 13వ తేదీన వెలుగు చూసింది.

also read:అనాథనని, కొత్త జీవితం ఇవ్వాలంటూ వల: యువకుడి నుంచి 15 లక్షలు దోచేసిన కిలాడీ లేడీ

చిత్తూరు జిల్లా విజయపురం మండలానికి చెందిన సునీల్  మార్కెటింగ్ చేస్తున్నాడు. ఇదే జిల్లాలోని ఓ ఫైనాన్స్ కంపెనీలో సుహాసిని పనిచేసేది.ఈ సమయంలోనే ఆ యువకుడితో సుహాసిని పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. తాను అనాధనని ఆమె సునీల్ కి చెప్పింది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు. పెళ్లికి ముందు రూ. 2 లక్షలను సుహాసిని ఆ యువకుడి నుండి తీసుకొంది. పెళ్లి తర్వాత మామా నుండి మరో రూ. 2 లక్షలు తీసుకొంది.ఈ విషయం తెలిసిన భర్త ఆమెను నిలదీశాడు.  దీంతో  ఆమె ఇంటి నుండి వెళ్లిపోయింది.

ఇంటి నుండి  నగదు, నగలతో వెళ్లిపోయింది. ఆమె ఇంటి నుండి వెళ్లి పోయిన కొంత కాలానికి ఆమె గదిలో దొరికిన ఆధార్ కార్డులో నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తితో పెళ్లైనట్టుగా ఆధార్ కార్డు లభ్యమైంది.ఈ విషయమై సుహాసినిని  సునీల్ నిలదీశాడు.  తనకు మరో పెళ్లి కూడ జరిగిందని ఆమె   సునీల్ కి షాకిచ్చింది. దీంతో తాను మోసపోయినట్టుగా గుర్తించిన ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తెలంగాణలోని కొత్తగూడెం ప్రాంతానికి చెందిన  వినయ్ ను కూడ ఇదే రీతిలో మోసం చేసినట్టుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2018లో సుహాసినితో వినయ్ కు పరిచయం ఏర్పడింది. 2019లో వినయ్ , సుహాసినిని పెళ్లి చేసుకొంది. ఆ తర్వాత తమ బంధవులు ఇంట్లో నుండి  నగదును, నగలను తీసుకెళ్లే విషయాన్ని గమనించి నిలదీశానని వినయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సుహాసిని తన మొదటి భర్త వెంకటేశ్వర్లు, పిల్లలను బంధువులుగా పరిచయం చేసిందని కూడ వినయ్ చెప్పారు.

ఈ ఫిర్యాదుల మేరకు సుహాసిని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. తిరుపతిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న సుహాసినిని బుధవారం నాడు అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్పారు.


 

click me!