మోసం చేసేవాడు కావాలా..? మాట మీద నిలబడే వాడు కావాలా..?

Published : Aug 13, 2017, 12:00 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
మోసం చేసేవాడు కావాలా..? మాట మీద నిలబడే వాడు కావాలా..?

సారాంశం

తాను నంద్యాల అభివృద్దికి కట్టుబడి ఉన్నాని జగన్ వాగ్దానం. బాబకు అవినీతి తప్ప అభివృద్ది తెలియదు. నంద్యాల ఉప ఎన్నిక ద్వారా బాబుకు బుద్ది చెప్పాలని సూచన.

చంద్రబాబు లాంటి మోసం చేసేవాడు కావాలా.. వైఎస్ లాంటి మాట మీద నిల‌బ‌డే వాడు కావాలా.. అని ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ప్ర‌శ్నించాడు వైసీపి అధ్య‌క్షుడు జ‌గ‌న్మోహాన్ రెడ్డి. నంద్యాల ఉప‌ ఎన్నిక ప్ర‌చారంలో ఆయ‌న ఐద‌వ రోజు ప్ర‌చారం కొన‌సాగుతుంది. ఆదివారం నంద్యాల పట్టణంలో రోడ్ షోలో పాల్గోన్న ఆయ‌న‌ చంద్ర‌బాబు ధ్వ‌జ‌మెత్తారు.


చంద్ర‌బాబు హయాంలో రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతోందని జ‌గ‌న్ విరుచుకుప‌డ్డారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ బాబు నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్రంలో మూడున్నరేళ్లలో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. నంద్యాల ఎన్నిక‌ల న‌గారా అనివార్యం అవ్వ‌గానే ఐదు కిలోమీటర్ల మేర రోడ్డుకు ఇరువైపులా ఉన్న భవనాలను కూల్చివేయడమే అభివృద్ధి అంటూ ఫోజులు కొట్టుకోవడం చంద్రబాబుకే చెల్లిందంటు ఎద్దేవా చేశారు. ఎన్నికలుంటేనే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకొస్తారని ఆయ‌న ఆరోపించారు.


చంద్ర‌బాబు ఇచ్చిన ఏ ఒక్క‌ వాగ్దానాన్నీ అమలు చేయలేదు కాబట్టే.. చంద్రబాబు, ఆయన కొడుకుతోపాటు కేబినెట్‌ మొత్తం నంద్యాల రోడ్లపై ప‌డే పరిస్థితి దాప‌రించిద‌ని జ‌గ‌న్ పెర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ప్రతి సామాజికవర్గాన్నీ మోసం చేశారని విమర్శించారు. ఎన్నికల హమీలలో ఒక్కటీ అమలు కాలేదని ప్రశ్నించే వారిపై దాడులు చేపిస్తార‌ని
 ఆరోపించారు. ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన వ్య‌క్త‌కి ఉరిశిక్ష విధించినా తప్పేమీ కాదు’ మ‌రోసారి ధ్వ‌జ‌మెత్తారు. నంద్యాల ఉప‌ ఎన్నిక న్యాయానికీ అన్యాయానికీ మధ్య జరుగుతున్న యుద్దంగా ఆయ‌న‌ చిత్రీక‌రించారు. చివరకు న్యాయమే గెలుస్తుందని జగన్‌ పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

Hello Lokesh Interaction: హలో లోకేష్ కార్యక్రమంలోవిద్యార్థులతో లోకేష్ పంచ్ లు | Asianet News Telugu
Minister Nara Lokesh: మంత్రి లోకేష్ నే ర్యాగింగ్ చేసిన విద్యార్థి అందరూ షాక్| Asianet Telugu