నంద్యాలలో అంగన్ వాడీలకు టిడిపి బెదిరింపులు

First Published Aug 13, 2017, 10:53 AM IST
Highlights
  • ప్రచారానికి, ఓట్లు వేయించుకునేందుకు టిడిపిలోని పలువురు నేతలు అంగన్ వాడీ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని అనుకున్నారు.

ఉపఎన్నికల తేదీ దగ్గర పడేకొద్దీ టిడిపి బెదిరింపులు ఎక్కవైపోతున్నాయి. తాజగా అంగన్ వాడీ ఉద్యోగులపై అభ్యర్ధికి అనుకూలంగ పనిచేయాలంటూ ఒత్తిడి పెరిగిపోతోంది. అంగన్ వాడీ ఉద్యోగులంటేనే గ్రామస్ధాయిలో పనిచేసే వారన్న విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ గెలుపు కోసం టిడిపి నానా అవస్తలు పడుతోంది. ఇటువంటి సమయంలోనే ప్రచారానికి, ఓట్లు వేయించుకునేందుకు టిడిపిలోని పలువురు నేతలు అంగన్ వాడీ ఉద్యోగులను ఉపయోగించుకోవాలని అనుకున్నారు.

అయితే, అందుకు వారు ఎదురుతిరిగారు. దాంతో వారిపై వేధింపులు మొదలయ్యాయి. ఉద్యోగాల నుండి తొలగిస్తామని, బదిలీలు చేస్తామని, జీతాలు నిలిపేస్తామంటూ ఏకంగా మంత్రులు, ఎంఎల్ఏల నుండే బెదిరింపులు వాస్తున్నట్లు ఉద్యోగులు బాహాటంగా ఫిర్యాదు చేస్తున్నారు. అధికారపార్టీ నేతల బెదిరింపులకు నిరసనగా నంద్యాలలో ఏకంగా భారీ ర్యాలీ నిర్వహించారంటేనే అర్ధమవుతోంది వారి పరిస్ధితి. వీరు వానే అనిలేదు. అవకాశం ఉన్న అన్నీ వర్గాలనూ టిడిపి నేతలు బెదిరిస్తున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయ్. గెలుపుపై అంత నమ్మకముంటే ఈ బెదిరింపులకు దిగటం ఎందుకో అర్ధం కావటం లేదు.

click me!