
Yoga Day 2025 : విశాఖపట్నంలో యోగా డే 2025 సందర్భంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేాశారు. అంతర్జాతీయ క్రీడల్లో యోగాను భాగం చేయాలని యోగాంధ్ర వేదికగానే ప్రధానిని కోరారు చంద్రబాబు. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ లో యోగాను భాగం చేసేలా కృషి చేయాలని చంద్రబాబు ప్రధానిని కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖ తీరం యోగాంధ్ర కార్యక్రమం నిర్వహణతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చంద్రబాబు అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2.17 కోట్ల మంది ఒకేసారి యోగా చేస్తున్నారని... విశాఖలో ఒకే చోట దాదాపు 3 లక్షల మందికి పైగా యోగా చేస్తున్నారని అన్నారు. ఇలా కూటమి ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమం అనేక రికార్డులు నెలకొల్పబోతోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఇప్పటికే విద్యాశాఖ ఆధ్వర్యంలో గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలతో రికార్డ్ సృష్టించారని తెలిపారు. ఈ సెప్టెంబర్ నుంచి యోగా లీగ్ ప్రారంభం అవుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. యోగాను విద్యార్థులు, యువత జీవితంలో భాగం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చంద్రబాబు అన్నారు.
ప్రతి ఒక్కరు మరీముఖ్యంగా యువత ప్రతి రోజూ కనీసం ఒక గంట యోగా చేయాలని... దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. స్వరాంధ్ర 2047 ముఖ్య ఉద్దేశం హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్... ఇది మనం సాధించడానికి యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
175 దేశాల్లో 12 లక్షల ప్రాంతాల్లో 10 కోట్ల మంది ప్రజలు ఈ యోగా డే 2025 లో పాల్గొంటున్నారని చంద్రబాబు అన్నారు. యోగా కేవలం ఫిజికల్ హెల్త్ కే కాదు మెంటల్ హెల్త్ కు ఉపయోగపడుతుందన్నారు. యోగా ద్వారా శాంతిని కూడా సాధించవచ్చన్నారు. నెల రోజులుగా ఏపీలో యోగాంద్ర వేడుకలు జరుగుతున్నాయని... ఇవాళ విశాఖ సముద్ర తీరంవెంట 28 కిలోమీటర్ల మేర ప్రజలు యోగాసనాలు వేస్తున్నారని అన్నారు.
రికార్డులకు బ్రేక్ చేయడం సరేంద్ర మోదీకే సాధ్యం... ఈ యోగా వేడుకల ద్వారా మరో రికార్డు సాధించడం ఖాయమన్నారు. యోగా ప్రస్తుతం మాస్ మూమెంట్ గా మారిందన్నారు. యోగా ద్వారా డిజిటల్ వరల్డ్ లో కూడా మిరాకిల్స్ చూడవచ్చన్నారు. ఈ యోగాంధ్ర ట్రెండ్ సెట్టర్ గా నిలిచిందని... తెలుగు జాతి ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నానని చంద్రబాబు అన్నారు.
యోగా విశిష్టతను రుగ్వేదంలో చెప్పారని... కానీ దాన్ని ఇన్నాళ్ళకు మోదీ విశ్వవ్యాప్తం చేసారని పవన్ కల్యాణ్ అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో యోగాకు గుర్తింపు దక్కడం... యావత్ ప్రపంచం యోగా డే ను జరుపుకోవడం భారతదేశానికి దక్కిన గౌరవమని అన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ సమక్షంలో విశాఖలో జరుగుతున్న యోగాంధ్ర కార్యక్రమం మరో ప్రపంచ రికార్డు సాంధించబోతోందని పవన్ ధీమా వ్యక్తం చేాశారు.
యోగాను ప్రపంచానికి పరిచయం చేసింది మోదీయే అని పవన్ అన్నారు. యోగాకు 175 దేశాల మద్దతు కూడగట్టిన శక్తి మోడీ... ఆయన సంకల్ప సాధకుడని కొనియాడారు. వన్ ఎర్త్.. వన్ హెల్త్ నినాదం మన విధానం కావాలని పవన్ కల్యాణ్ సూచించారు.