వైసీపీకి సీనియర్ నేత రాజీనామా.. వెంటనే యూటర్న్

Published : Nov 10, 2018, 10:01 AM IST
వైసీపీకి సీనియర్ నేత రాజీనామా.. వెంటనే యూటర్న్

సారాంశం

 పెద్దాపురం వైసీపీలో గందరగోళం నెలకొంది. పెద్దాపురం నియోజకర్గ వైసీపీ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు పార్టీకి రాజీనామా చేశాడు. కానీ.. అంతలోనే మళ్లీ యూటర్న్ తీసుకొని.. తన రాజీనామాను వెనక్కి తీసుకున్నాడు. 

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం వైసీపీలో గందరగోళం నెలకొంది. పెద్దాపురం నియోజకర్గ వైసీపీ కోఆర్డినేటర్ తోట సుబ్బారావునాయుడు పార్టీకి రాజీనామా చేశాడు. కానీ.. అంతలోనే మళ్లీ యూటర్న్ తీసుకొని.. తన రాజీనామాను వెనక్కి తీసుకున్నాడు. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. తోట సుబ్బారావు నాయుడు.. మొన్నటి వరకు నియోజకవర్గ కోఆర్డినేటర్ బాధ్యతలు నిర్వర్తించారు. కాగా.. ఇప్పుడు ఆ పదవిని మరొకరికి కట్టపెట్టారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన తోట.. పార్టీకి రాజీనామా చేశాడు.

ఇదే విషయాన్ని శుక్రవారం తన కార్యకర్తలకు తెలియజేశాడు. తాను పార్టీ పెట్టిననాటి నుంచి పార్టీ కోసం ఎంతగానో కృషి చేశానని.. అలాంటి తనని కాదని.. వేరే వ్యక్తికి కో ఆర్డినేటర్ బాధ్యతలు అప్పగించడం బాధగా అనిపించిందన్నారు. అందుకే పార్టీకి రాజీనామా చేస్తునట్లు తెలిపారు. 
 
దీంతో కార్యకర్తలు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు. రాజీనామా వద్దని కార్యకర్తలు వారించి రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆయన తన రాజీనామాను తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు. అలాగే కార్యకర్తలకు ఎటువంటి ఒత్తిడి లేదని మీకు నచ్చిన పార్టీలో కొనసాగవచ్చని వారికి సూచించారు. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు