కంట్లో కారం చల్లి.. కత్తులతో వెంటాడి టీడీపీ నేత దారుణహత్య

sivanagaprasad kodati |  
Published : Nov 10, 2018, 07:38 AM ISTUpdated : Nov 10, 2018, 12:48 PM IST
కంట్లో కారం చల్లి.. కత్తులతో వెంటాడి టీడీపీ నేత దారుణహత్య

సారాంశం

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగవిప్పింది.. దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో తెలుగుదేశం పార్టీ నేత సోమేశ్వర్ గౌడ్‌ను అత్యంత దారుణంగా నరికి చంపారు.

కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ మరోసారి పడగవిప్పింది.. దేవనకొండ మండలం కె.వెంకటాపురంలో తెలుగుదేశం పార్టీ నేత, మండలాధ్యక్షుడు సోమేశ్వర్ గౌడ్‌ను అత్యంత దారుణంగా నరికి చంపారు. ఇతనికి పల్లెదొడ్డిలో ఓ మద్యం షాపు ఉంది...

రాత్రి షాపు మూసేసిన తర్వాత కుమారుడితో కలిసి వస్తుండగా మార్గమధ్యంలో మాటు వేసిన ప్రత్యర్థులు  సోమేశ్వర్‌ కళ్లలో కారం చల్లి హత్య చేసేందుకు ప్రయత్నించారు. వారి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ వేటకొడవళ్లతో వెంటాడీ మరీ నరికి చంపారు.

దీంతో సోమేశ్వర్ గౌడ్ అక్కడికక్కడే మరణించగా... ఆయన కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న టీడీపీ శ్రేణులు అక్కడికి భారీగా చేరుకున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేయడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు భారీగా మోహరించారు. 
 

PREV
click me!

Recommended Stories

లోకేష్ పంచ్ లకి పడి పడి నవ్విన టీచర్స్ Nara Lokesh Meets Teachers Returned from Singapore Study Tour
ఇలా చేస్తే ఒక్క క్లిక్ తో ఏ సబ్జెక్టువీక్ ఉన్నాడో ఈజీగా తెలిసిపోతుంది | Nara Lokesh Meets Teachers