బీజేపీయేతర ఫ్రంట్: స్టాలిన్‌తో చంద్రబాబు భేటీ...త్వరలో మమతా బెనర్జీతో

By Arun Kumar PFirst Published Nov 9, 2018, 9:12 PM IST
Highlights

కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బీజేపియేతర పార్టీలను ఏకం చేయడానికి ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు ముమ్మరం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీఎస్పీ అధినేత మాయావతి, కర్ణాటక సీఎం కుమార స్వామి, మాజీ ప్రధాని  దేవేగౌడలను కలిసి చర్చించారు. తాజాగా ఇవాళ తమిళనాడులో ప్రతిపక్ష డీఎంకే పార్టీ అధ్యక్షుడు స్టాలిన్ తో చంద్రబాబు భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, బిజెపి తీరు పట్ల స్టాలిన్‌తో చంద్రబాబు చర్చించారు. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ... దేశ ప్రయోజనాల కోసం తమకు సహకరించాలని స్టాలిన్ ను కోరినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర సంస్థలను తమ స్వప్రయోజనాలు, ప్రతిపక్షాలను వేధించడానికి వాడుకుంటున్నాయని విమర్శించారు. బీజేపీని గద్దె దించేందుకు విబేధాలను విడిచి అన్ని పార్టీలను ఏకతాటిపైకి తేవడానికి తన ప్రయత్నం కొనసాగుతుందన్నారు. త్వరలో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలవనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

ఈ భేటీ గురించి స్టాలిన్ కూడా మాట్లాడారు.  వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీలను కలపడానికి చంద్రబాబు పర్యటించడం ఆహ్వానించదగ్గ పరిణామని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రయత్నాలకు  తమ పార్టీ పూర్తిగా సహకరిస్తుందన్నారు. త్వరలోనే దేశంలోని బీజేపీయేతర పార్టీలతో పార్టీలమంతా సమావేశమై కలుస్తామని అన్నారు. ఇ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని స్టాలిన్ తెలిపారు.   

ఈ సమావేశంలో డీఎంకే నేతలు కనిమొళి, టీఆర్‌ బాలుతో పాటు టిడిపి ఎంపీలు సీఎం రమేష్‌, కనకమేడల రవీంద్రలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు

బీజేపీయేతర ఫ్రంట్: దేవేగౌడ‌, కుమారస్వామిలతో బాబు భేటీ

బాబు ఫ్రంట్‌: ధర్మపోరాట దీక్షకు బీజేపీయేతర పార్టీలు

click me!