బాబు సొంత గృహనిర్మాణపథకం ఒక్కటే సక్సెస్ ఆంధ్రలో

First Published Apr 11, 2017, 8:38 AM IST
Highlights

"చంద్రబాబు పాత ఇళ్లకు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, శేర్ లింగంపల్లి ఫాం హౌస్, పార్క్ హయత్ స్విట్, లింగంపల్లి గెస్ట్ హౌస్ కు, విజయవాడ క్యాంప్ ఆఫీస్ కు, వెలగపూడిలో సీఎం ఆఫీసుకు వందల కోట్లు ఖర్చు చేశారు.  ఈ మూడేళ్లలో పేదోళ్లకు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదు. అమరావతిలో ఉండకుండా  హైదరాబాద్ లో  పర్మనెంట్ మకాం ఎందుకో సమాధానం చెప్పాలి,"  వైసిపి నేత భూమన.

 "రాష్ట్రంలో పేదల కోసం లక్షల ఇళ్లు కడతానని  హామీ ఇచ్చారు.

అయితే,  మూడేళ్లలో పూర్తయింది ఒకే ఒక్క ఇల్లు.

 ఆ ఇంటికోసం కోట్లు ఖర్చు చేశారు. గోప్యంగా కట్టారు. గుట్టుగా గృహప్రవేశం చేశారు.అయితే, ఈఇల్లు కట్టించింది కూడా ఆంధ్రలో కాదు, తెలంగాణాలో.

ఈ ఇల్లెవరిదో తెలుసా...

అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఇల్లు, ఇదీ ఆయన గృహనిర్మాణ పథకం," అని  వైసిపి ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి ఈ రోజు వ్యాఖ్యానించారు.

 

విజయవాడలో  ఈ రోజు విలేకరులతో మాట్లాడుతూ ‘చంద్రబాబు ఇంటికోసం ఎన్ని వందల కోట్లు ఖర్చు చేశారు? హైదరాబాద్ లో రహస్యంగా ఇంటిని ఎందుకు కట్టాల్సి వచ్చింది,’ అని అని  భూమన ప్రశ్నించారు.

 

రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో ఎందుకు ఇల్లు కట్టుకుంటున్నారో ప్రజలకు ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని ఆయన అన్నారు.ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు తరిమితే ఉండటానికే హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నారా అని అనుకోవలసి వస్తున్నదని ఆయన అన్నారు.

 

అమరావతిని సింగపూర్, దావోస్, షాంఘై లాగా చేస్తానని అంటే.. ఏదో అనుకున్నారు. కానీ,  ఆయన ఆస్టయిల్లో కట్టుకున్నది, కంప్లీట్ చేసుకున్నది కూడా  సొంత ఇల్లే నని భూమన తెలిపారు.  అన్ని ప్రాజక్టులు తాత్కాలికమే అయినా, కనీసం సొంత ఇల్లును శ్రద్ధగా విదేశీపరిజ్ఞానంతో పూర్తి చేసుకున్నారని , చంద్రబాబాబునాయుడు శాశ్వత ప్రాజక్టు ఇదేనని ఆయన అన్నారు.

 

ముఖ్యమంత్రి గృహం ప్రభుత్వానికి ఒక గుది బండయిందని భూమన వ్యాఖ్యానించారు.

 

"చంద్రబాబు పాత ఇళ్లకు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్, శేర్ లింగంపల్లి ఫాం హౌస్, పార్క్ హయత్, లింగంపల్లి గెస్ట్ హౌస్ కు, విజయవాడ క్యాంప్ ఆఫీస్ కు, వెలగపూడిలో సీఎం ఆఫీసుకు వందల కోట్లు ఖర్చు చేశారు.  ఈ మూడేళ్లలో పేదోళ్లకు ఒక్క ఇళ్లు కూడా కట్టించలేదు. అమరావతిలో ఉండకుండా  హైదరాబాద్ లో  పర్మనెంట్ మకాం ఎందుకో కు సమాధానం చెప్పాలి,"  భూమన ప్రశ్నించారు.

 

click me!