గుడివాడ టెన్షన్ లో పేర్ని నాని, విడిపించిన కొడాలి నాని

Published : Apr 11, 2017, 07:37 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
గుడివాడ టెన్షన్ లో పేర్ని నాని, విడిపించిన కొడాలి నాని

సారాంశం

ఈ టెన్షన్  లో  వైసిపి సినాయకుడు పేర్ని నాని కారు   ఇరక్కుపోయింది. ఆయన కారు వూర్లో తిరుగుతూ పోలీసుల కంట పడింది. వెంటనే వారు కారు ఆపేశారు. ఆయన్ను దిగనీయలేదు. కారును కదలనీయలేదు. కొడాలి నాని వచ్చి ఆయనను విడిపించాడు.

గుడివాడలో  ఈ రోజు ఒకటే టెన్షన్.

 

ఈ టెన్షన్  లో  వైసిపి సినాయకుడు పేర్ని నాని కారు   ఇరక్కుపోయింది. ఆయన కారు వూర్లో తిరుగుతూ పోలీసుల కంట పడింది. వెంటనే వారు కారునాపేశారు. ఆయన్ను దిగనీయలేదు. కారును కదలనీయలేదు. 

 

ఈ విషయం వూర్లోనే శరత్ ధియోటర్లో  ఉన్న కొడాలినానికి తెలిసింది. ఆయన వెంటనే పేర్ని నాని కోసం రోడ్డు మీదకు వచ్చాడు. పేర్నిని ఆపేసిన పోలీసుల దగ్గిరకు వెళ్లి   ఎందుకాపారని నిలదీశారు.ఊర్లో టెన్షన్ గా ఉందని  ఆయన కారును ఆపామని డిఎస్ పి చెప్పారు. కారుదగ్గరకు వెళ్లి, నాతో రమ్మని పేర్ని నానికి చెప్పారు. ఆయన కారు దిగి , నానితో కలసి శరత్ ధియోటర్లోకి వెళ్లారు. పోతూ పోతూ అన్న మాటలివి “ ఎల్లపుడు ఒకే ప్రభుత్వం ఉండదు. ఉరి తీసి చంపుతారా ఏమిటి?”

 

కొడాలి నాని శరత్ ధియోటర్ నుంచి బయటకు రావడం, పోలీసుల దగ్గిరకు చేరుకోవడం, పోలీసుల వలయంలో ఉన్న పేర్ని నాని కారును సమీపించి, ఆయనను తీసుకుని వెళ్లడం... చూసి తీరవలసిందే...

 

నేపథ్యం

 

ఈ టెన్షన్ కు ఒక నేపథ్యం ఉంది. గుడివాడ మున్సిపాల్టీ 19వ వార్డు ఉపఎన్నికలో టీడీపీ 150ఓట్లతో గెలుపొందింది.  కొడాలి నానీ స్పాన్సర్ చేసిన  అభ్యర్థి ఓడిపోయాడు.  దీనితో టిడిపి నేతలు ఒక విజయోత్సవం జరుపుకున్నారు. ఇది వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య గొడవకు దారి తీసింది.

 

టిడిపి ర్యాలీ లో భాగంగా వైసీపీ కార్యాలయం ముందు బాణాసంచా కాల్చి టీడీపీ శ్రేణులు వైసిపి వారిని రెచ్చగొట్టాయి. అటుగా వస్తున్న వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ని చూసి పార్టీ నినాదాలు చేశారు. ఇదంతా ఉద్రికత్తకు దారి తీసింది.

 

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan on Blind Cricketer Deepika TC Road Request | Janasena Party | Asianet News Telugu
Holidays : జనవరి 2026 లో ఏకంగా 13 రోజులు సెలవులే.. అన్నీ లాంగ్ వీకెండ్స్..!