వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చి జగన్‌ను చుట్టుముట్టి ఉత్సాహంగా నినాదాలు చేశారు. పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు నాయకులు, కార్యకర్తలు కలిసి వైసీపీ 16ఏళ్ల పండగను ఘనంగా జరుపుకున్నారు.