వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ మా ఎజెండా: జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్ కళ్యాణ్.. పొత్తులపై వ్యాఖ్య

By Mahesh KFirst Published Apr 4, 2023, 10:28 PM IST
Highlights

బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ సమావేశం అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ  రాష్ట్రంలో అధికారం సాధించే దిశగా చర్చించామని తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ ఎజెండా అని వివరించారు. పొత్తులపైనా ఆయన కొంత స్పష్టత ఇచ్చారు.
 

న్యూఢిల్లీ: జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆయనతో మంగళవారం రాత్రి భేటీ అయ్యారు. ఈ సమావేశం అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలు తెలిపారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ తమ అజెండా అని వివరించారు. ఆ దిశగానే తాము చర్చలు చేశామని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా వ్యవహరించడంపైనే ఫోకస్ పెట్టామని వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌ సుస్థిరత్వం సాధించాలనే తాము సంకల్పించినట్టు పవన్ కళ్యాణ్ వివరించారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ అజెండా అని పేర్కొన్నారు. అందుకోసం వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టిపరిస్థితుల్లో చీలనివ్వబోమని తెలిపారు. అటువైపు చర్చలు చేశామని అన్నారు. అవినీతిపైనా చర్చించామని వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అవినీతి, అక్రమాలు, ఇక్కడి పరిస్థితులపై కూలంకశంగా చర్చించామని తెలిపారు.

పొత్తుల గురించీ ఆయన కొంత స్పష్టత ఇచ్చారు. తమ చర్చలు ఇప్పటి వరకు పొత్తులపై మాట్లాడేంతగా వెళ్లలేవని అన్నారు. అయితే, బీజేపీ, జనసేన పార్టీలు రెండూ కూడా స్థానికంగా బలోపేతం కావడంపై శ్రద్ధ పెట్టినట్టు వివరించారు.

Also Read: సీఎం వైఎస్ జగన్ కాలికి గాయం.. రేపటి ఒంటిమిట్ట పర్యటన వాయిదా

ఈ సమావేశం మొత్తం కూడా రాష్ట్రంలో అధికారం సాధించే దిశగానే జరిగిందని పవన్ వివరించారు. వైసీపీని ఎలా ఓడించాలన్న విషయంపై మాట్లాడామని తెలిపారు. ఈ చర్చల సత్ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని వివరించారు. రాబోయే రోజుల్లో అన్ని విషయాలు వివరంగా వివరిస్తానని అన్నారు. బీజేపీ అగ్రనాయకులతో పవన్ కళ్యాణ్ రెండు రోజులుగా సమావేశమయ్యారు.

click me!