సీఎం వైఎస్ జగన్ కాలికి గాయం.. రేపటి ఒంటిమిట్ట పర్యటన వాయిదా

Siva Kodati |  
Published : Apr 04, 2023, 07:57 PM IST
సీఎం వైఎస్ జగన్ కాలికి గాయం.. రేపటి ఒంటిమిట్ట పర్యటన వాయిదా

సారాంశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలికి గాయమైంది. ఉదయం వ్యాయామం చేస్తుండగా ఆయన కాలు బెణికింది . దీంతో వైద్యుల సూచన మేరకు రేపటి ఒంటిమిట్ట పర్యటనను జగన్ రద్దు చేసుకున్నారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. ఉదయం వ్యాయామం చేస్తుండగా ఆయన కాలు బెణకడంతో గాయమైంది. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందించారు. గతంలోనూ ఇదే తరహా గాయంతో చాలా రోజులు ఇబ్బందిపడ్డారు జగన్. ఈ నేపథ్యంలో ప్రయాణాలు రద్దు చేసుకోవాలని డాక్టర్లు సూచించారు. వైద్యుల సూచన మేరకు రేపటి ఒంటిమిట్ట పర్యటనను ముఖ్యమంత్రి రద్దు చేసుకున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, నేతలు జగన్ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?