కరోనాకు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించవయ్యా: శ్రీవారిని వేడుకున్న విజయసాయి

By Arun Kumar PFirst Published Jul 4, 2020, 10:54 AM IST
Highlights

త్వరలో కరోనా కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించమని తిరుమల శ్రీవారిని కోరినట్లు రాజ్యసభ సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. 

తిరుమల: త్వరలో కరోనా కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించమని తిరుమల శ్రీవారిని కోరినట్లు రాజ్యసభ సభ్యులు, జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి తెలిపారు. తిరుమల వెంకటేశ్వర స్వామిని శనివారం ఉదయం విజయసాయి రెడ్డితో పాటు ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్ పర్సన్  లక్ష్మి పార్వతి దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని వెంకటేశ్వర స్వామిని మనస్పూర్తిగా కోరుకున్నానని తెలిపారు.

read more    మృతదేహంలో కరోనా వైరస్ ఎంతసేపు వుంటుందంటే...: ఏపీ వైద్యశాఖ కార్యదర్శి

రాష్ట్రం, దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ప్రజలు కరోనా మహమ్మారి భారిన  పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది భక్తులు ఈ వైరస్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేక పోతున్నారు. అయినప్పటికీ టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి చక్కటి ప్రణాళికతో భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యాన్ని కల్పించడం అభినందనీయమని కొనియాడారు. త్వరలో కరోనా వైరస్ కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించాలని  శ్రీవారిని కోరినట్లు విజయసాయి తెలిపారు. 

ఇక శుక్రవారం ఏపీలో 837 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే కరోనాతో తొమ్మిది మంది మృత్యువాత పడ్డారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 16,934కి చేరుకొగా ప్రస్తుతం 9,096 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా ప్రకటించింది. మరో వైపు 7632 మంది కరోనా నుండి కోలుకొన్నట్టుగా ప్రభుత్వం వివరించింది.

 రాష్ట్రంలోని కర్నూల్  జిల్లాలో అద్యధిక కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ జిల్లాలో 2236 కేసులు నమోదయ్యాయి. కర్నూల్ తర్వాతి స్థానంలో అనంతపురం జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1972 కేసులు నమోదయ్యాయి. మూడో స్థానంలో కృష్ణా జిల్లా నిలిచింది. ఈ జిల్లాలో 1611 కేసులు నమోదయ్యాయి. నాలుగో స్థానంలో గుంటూరు జిల్లా నిలిచింది. ఇక్కడ 1610 కేసులు రికార్డయ్యాయి.

click me!