బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... శని, ఆదివారం ఏపీలో భారీ వర్షాలు

Arun Kumar P   | Asianet News
Published : Jul 04, 2020, 10:19 AM ISTUpdated : Jul 04, 2020, 10:37 AM IST
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం... శని, ఆదివారం ఏపీలో భారీ వర్షాలు

సారాంశం

శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.   

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ తీరానికి దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ఆవర్తనం ఏర్పడి వుందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది ఎత్తుకు వెళ్లే కొద్దీ దక్షిణ దిశగా ఒంపు తిరిగిందని... దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉత్తరాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి  భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. 

ప్రతిసారి దోబూచులాడే రుతుపవనాలు ఈసారి అనుకున్న సమయానికి కేరళను తాకాయని భారత వాతావరణ శాఖా ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా రుతుపవనాల్లో త్వరితమైన కదలికలు ఏర్పడి కేరళను తాకేలా చేశాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో సకాలంలో నైరుతి రుతుపవనాలు రాష్ట్రాల్లోకి ప్రవేశించి వ్యాప్తి చెందడంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. 
 
 
 

PREV
click me!

Recommended Stories

Roja vs Kirrak RP: నీ పిల్లల ముందు ఇలాంటి మాటలు అనగలవా? రోజాకు గట్టిగా ఇచ్చేసిన కిర్రాక్ ఆర్పి
YS Jagan Massive Rally & Governor Meet: అభిమానులు పెద్ద సంఖ్యలో మద్దతు | YSRCP | Asianet News Telugu