బుట్టా రేణుకకు బీజేపీ ఆహ్వానం.. మండిపడుతున్న వైసీపీ

First Published Jul 17, 2018, 3:36 PM IST
Highlights

తమ పార్టీ నుంచి అధీకారికంగా లేఖ లేకుండా బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఎంపీపై అనర్హత  పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా పార్టీ తరఫున ఎలా పిలుస్తారని కేంద్రమంత్రి అనంతకుమార్‌ను  నిలదీశారు. 

అఖిలపక్ష సమావేశంలో బీజేపీ తీరుపై వైసీపీ మండిపడుతోంది. ఈ అఖిలపక్ష సమావేశానికి ఫిరాయింపు  ఎంపీ బుట్టా రేణుక ను ఆహ్వానించడంపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఒక ఫిరాయింపు ఎంపీని సమావేశానికి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు. బుట్టా రేణుకను ఆహ్వానించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. 

తమ పార్టీ నుంచి అధీకారికంగా లేఖ లేకుండా బుట్టా రేణుకను ఎలా పిలుస్తారని ఆయన ప్రశ్నించారు. ఎంపీపై అనర్హత  పిటిషన్‌ పెండింగ్‌లో ఉండగా పార్టీ తరఫున ఎలా పిలుస్తారని కేంద్రమంత్రి అనంతకుమార్‌ను  నిలదీశారు. 

కాగా.. విజయసాయిరెడ్డి వాదనకు వామపక్షాలు కూడా మద్దతు తెలిపాయి. అమ్ముడుపోయిన ఎంపీని ఏ అధికారంతో పిలిచారని ఎంపీ ప్రశ్నించారు. ఇది రూల్స్‌కు విరుద్ధంగా ఉంది.. మీ చర్య నీతి బాహ్యమైనదని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. 
 
బుట్టా రేణుక అనర్హత విషయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి అనంతకుమార్ నచ్చచెప్పే ప్రయత్నం చేయగా.. ఆయన వినిపించుకోలేదు. అంతేకాదు  బుట్టారేణుక నేమ్‌ ప్లేట్‌ తీసేయక పోతే.. సమావేశానికి బాయ్‌కాట్‌ చేస్తామని హెచ్చరించారు. దీంతో.. ఆమె నేమ్ ప్లేట్ ని తొలగించారు. 

click me!