పవన్ మాటలు నమ్మశక్యం కాదంటున్న బొత్స

First Published Jul 17, 2018, 2:53 PM IST
Highlights

పవన్ చెప్పిన మాటలను నమ్మలేమని.. నిజంగా వారు ముగ్గురు కూర్చున్నా..జోన్ వస్తుందనే నమ్మకం లేదన్నారు.

జనసేన అధినేత పవన్ చెప్పే మాటలన్నీ నమ్మసక్యం కాదని  వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ‘రైల్వే జోన్‌ కోసం ప్రజలంతా రోడ్డెక్కాల్సిన అవసరం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌ విశాఖ రండి.. మనం ముగ్గురం పట్టాలపై కూర్చుని రైళ్లను ఆపుదాం. జోన్‌ ఎందుకు ఇవ్వరో చూద్దాం’  అని ఇటీవల పవన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

కాగా.. ఈ వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ స్పందించారు. పవన్ చెప్పిన మాటలను నమ్మలేమని.. నిజంగా వారు ముగ్గురు కూర్చున్నా..జోన్ వస్తుందనే నమ్మకం లేదన్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో పార్లమెంటులో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే తాను దేశమంతా తిరిగి 50 మంది ఎంపీల మద్దతు కూడగడతానని చెప్పిన పవన్‌, తీరా అవిశ్వాసం పెట్టిన తర్వాత కనిపించకుండా పోయిన విషయం గుర్తుచేసుకోవాలన్నా రు. 

టీడీపీ పాలన 1500 రోజులు పూర్తయినా ప్రజల కు ఒరిగిందేమీ లేదని, ఆ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు మాత్రం పెరిగాయన్నారు. 18 మంది ఎంపీలతో ఏమీ సాధించలేకపోయిన నాయకుడు మరో 7 ఎంపీ సీట్లు ఇస్తే హోదా సాధిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్‌ పేరెత్తడానికి కూడా చంద్రబాబుకు అర్హత లేదని, వైఎస్‌ బతికుంటే టీడీపీ ఎప్పుడో భూస్థాపితం అయిపోయి ఉండేదన్నారు.

click me!