ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు: కేంద్ర బడ్జెట్ 2023పై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి

By narsimha lodeFirst Published Feb 1, 2023, 3:33 PM IST
Highlights


ప్రత్యేక హోదా, విభజన హమీల విషయంలో  బడ్జెట్ లో  కేంద్రం  ఎలాంటి ప్రస్తావన చేయలేదని  వైసీపీ  ఎంపీలు  చెప్పారు.  విభజన హీమల విషయంలో  పార్లమెంట్ లో  పోరాటం  చేస్తామని  వూసీపీ ఎంపీ మిథున్ రెడ్డి  ప్రకటించారు.  

న్యూఢిల్లీ:విభజన హమీల విషయంలో  కేంద్ర బడ్జెట్ లో  ఎలాంటి హమీ ఇవ్వలేదని  వైసీపీ  ఎంపీ మిథున్ రెడ్డి  చెప్పారు.  ఏపీకి  కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్  సాక్షిగా  ఇచ్చిన ప్రత్యేక హోదా  హమీపై  కూడా ప్రస్తావన లేదన్నారు. బుధవారం నాడు మధ్యాహ్నం కేంద్ర బడ్జెట్  2023పై  న్యూఢిల్లీలో  వైసీపీ ఎంపీలతో కలిసి  మిథున్ రెడ్డి మీడియాతో  మాట్లాడారు.   ఏపీ రాస్ట్రానికి  జీవనాడి లాంటి  పోలవరం ప్రాజెక్టుకు  నిధుల కేటాయింపు విషయమై   ప్రస్తావన లేదన్నారు. 

 ప్రత్యేక హోదా గురించి  బడ్జెట్ లో  ప్రస్తావన లేకపోవడం  బాధాకరమని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి   తెలిపారు.   ప్రత్యేక హోదాపై  చివరి వరకు  పోరాటం  సాగిస్తామని  వైసీపీ  ఎంపీ మిథున్ రెడ్డి  ప్రకటించారు.  విభజన హమీలను అమలు చేయాలని కోరుతూ  పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో  పోరాటం చేస్తామని ఆయన  చెప్పారు.  

ట్యాక్స్  బెనిఫిట్స్ తో  మధ్య తరగతి  ప్రజలకు  ఉపయోగం కలుగుతుందని  మిథున్ రెడ్డి అభిప్రాయపడ్డారు.. రైల్వే కారిడార్ గురించి బడ్జెట్ లో  ప్రస్తావన లేదన్నారు.   ఆక్వా ఉత్పత్తుల దిగుమతి సుంకాలపై  రాయితీ  ఇవ్వడం  మంచి పరిణామంగా  వైసీపీ  ఎంపీ  మోపిదేవి వెంకటరమణ తెలిపారు.  
 

click me!