కేంద్ర బడ్జెట్ లో ఆదాయపన్ను శ్లాబా్ రేటు కొంత ఊరటనిచ్చిందని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.
అమరావతి:కేంద్ర బడ్జెట్ ను గుడ్ బడ్జెట్ గా భావిస్తున్నామని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బడ్జెట్ లో కొన్ని శాఖలకు కేటాయింపులు సంతృప్తినిచ్చాయని ఆయన చెప్పారు. కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయని ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. బుధవారంనాడు ఏపీ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కేంద్ర బడ్జెట్ ట్ పై మీడియాతో మాట్లాడారు.ఆదాయపు పన్ను శ్లాబా్ రేట్లు ఊరటనిచ్చాయన్నారు. కొన్ని కేటాయింపులు సంతృప్తినిచ్చినట్టుగా ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. రైల్వేలు, రోడ్లలో మౌలిక వసతులపై బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించినట్టుగా ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు. వ్యవసాయం, పౌరసరఫరాలపై కేటాయింపులు తగ్గినట్టుగా కన్పిస్తుందన్నారు. ఏడు ముఖ్యమైన అంశాలకు బడ్జెట్ లో కేటాయింపులు చేసినట్టుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారని ఆయన గుర్తు చేశారు.
ప్రీ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున అందించిన సలహాలు,సూచనలను కేంద్రం పరిగణనలోకి తీసుకున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. పంప్ స్టోరేజ్ విధానాన్ని అమలు చేయాలని కోరినటట్టుగా చెప్పారు.. ఈ రంగంలో ఏపీ రోల్ మోడల్‌గా ఉందన్నారు. . దీనిపై పాలసీ తేవాలని కోరామనన్నారు. ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం. పాలసీని ప్రకటించిందని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన నిధులు పెంచాలన్న ఏపీ విజ్ణప్తిపై కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ తరహాలో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన చెప్పారు.
ఏపీ ప్రతిపాదనను పరిగణించి అర్బన్ ఇన్ ఫ్రా డెవలప్ ఫండ్ దేశ వ్యాప్తంగా ప్రారంభం కావడం గర్వకారణంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలకు అనువుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుందన్నారు.స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు, ఎయిర్ పోర్టులు, పోర్టులు నిర్మాణం, గృహ నిర్మాణం, ఏకలవ్య స్కూళ్ల అభివృద్ధికి బడ్జెట్ తోడ్పాటును ఇస్తుందని మంత్రి తెలిపారు. వ్యక్తిగత పన్ను రాయితీ ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక అంశాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు.
రాష్ట్రానికి సంబంధించి ఎరువులలో రూ.50 వేల కోట్లు కేటాయింపు తగ్గిందని చెప్పారు. సబ్సిడీకి సంబంధించి ఫుడ్‌లో రూ.97 వేలు తగ్గిందన్నారు. విద్యకు రూ.13 వేల కోట్లు, విద్యుత్ రూ.25 వేల కోట్లు పెంచారని మంత్రి వివరించారు. రోడ్లు రవాణాలో పెరుగుదల నమోదైంది గ్రామాల్లో పనికి ఆహార పథకం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు తగ్గాయన్నారు. పీఎం ఆవాస్ యోజన పథకానికి 66 శాతం నిధులు పెంచారని తెలిపారు.
ఎయిర్ పోర్టులు, పోర్టులు, హెలీపాడ్‌లు పెట్టడం వల్ల ఏపీకి ప్రయోజనం కలుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు. ఏకలవ్య పాఠశాలల ఏర్పాటు, ఐటీడీఎ, ఆక్వాకల్చర్ బెనిఫిట్స్ ఉపయోగపడుతాయని మంత్రి చెప్పారు. ఉపాధి హామీ, జలజీవన్ మిషన్, యూరియా, బియ్యం,గోధుమలకి నిధుల కేటాయింపు తగ్గిందని మంత్రి తెలిపారు.