టీడీపీ నేతల దూషణలతో ట్విస్ట్: చిక్కుల్లో వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి

By telugu teamFirst Published Sep 5, 2019, 7:13 AM IST
Highlights

వైసిపి ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తనంత తానుగా చిక్కులు కొని తెచ్చుకున్నట్లే కనిపిస్తున్నారు. టీడీపి నేతల అరెస్టు తర్వాత తాను చేసిన ప్రకటన ఆమెకు కష్టాలు తెచ్చే పెట్టే అవకాశాలున్నాయి.

రెండు రోజుల కింద దళిత ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవిపై టీడీపీ నాయకుల కుల వివక్ష చూపెడుతూ అవమానించిన విషయం ఎంత కలకలం రేపిందో మనందరికీ తెలిసిందే. ఈ ఆధునిక ప్రగతిశీల సమాజంలో ఇలా కుల వివక్ష ప్రదర్శించడం చాలా నీచమైన చర్య. దీనిపైన వెంటనే స్పందించిన ప్రభుత్వం కఠిన చర్యలకు ఆదేశించింది. ఇలాంటి చర్యలను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదు కూడా. 

ఎమ్మెల్యే శ్రీదేవి తుళ్లూరు మండల పరిధిలో జరిగిన ఆ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసారు.  వెనువెంటనే పోలీసులు కేసు నమోదు చేసి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడి దాకా బాగానే ఉంది. ఈ అరెస్ట్ తతంగం పూర్తికాగానే శ్రీదేవి చెప్పిన విషయం ఇప్పుడు ఆవిడను చిక్కుల్లో పడేసేలా కనపడుతుంది. ఈ వివాదాస్పద అంశం ఏకంగా ఆవిడ ఎమ్మెల్యే పదవికే ఎసరు తెచ్చేలా కనపడుతుంది. 

విషయం ఏమిటంటే,  తాను క్రిస్టియన్ అని, తన భర్త కాపు కులానికి చెందినవాడని శ్రీదేవి తెలిపింది. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది.  శ్రీదేవి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడికొండ రిజర్వుడు నియోజకవర్గం నుండి గెలుపొందారు. 

ఎవరైనా దళితులు మతం మార్చుకుంటే చట్టప్రకారంగా వారికి సంక్రమించే రేజర్వేషన్లను కోల్పోతారు. దీని ప్రకారంగా చూస్తే ఆమె రిజర్వుడు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి అనర్హురాలు. 

ఇప్పటికే జగన్ పైన అన్యమతస్థుడనే కార్డును బలంగా వాడుతున్న బీజేపీ ఈ కొత్త విషయాన్ని కూడా అందిపుచ్చుకున్నా అశ్చర్యం లేదు..  శ్రీదేవి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసి తన ఎన్నిక చెల్లదని ప్రకటించాలని ప్రత్యర్థులు రంగంలోకి దిగే అవకాశం ఉంది.

మొత్తానికి ఈ విషయం కొత్త ట్విస్టుతో వైసీపీకి కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టేదిలా కనపడుతుంది. 

సంబంధిత వార్తలు

ఎమ్మెల్యే శ్రీదేవిపై వ్యాఖ్యలు: నలుగురి అరెస్ట్

అవమానిస్తున్నారు: టీడీపీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి ఫైర్

వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవి కంటతడి: నలుగురిపై కేసు

టీడీపీ నేతల దూషణలు: కన్నీళ్లు పెట్టుకున్న వైసిపి ఎమ్మెల్యే శ్రీదేవి

 

click me!