బాలకృష్ణ అల్లుడి భూమి స్వాధీనం, ఎందుకు గగ్గోలు: అమర్నాథ్

By telugu teamFirst Published Oct 24, 2020, 12:05 PM IST
Highlights

గీతం యూనివర్శిటీ ఆధీనంలోని భూములను స్వాధీనం చేసుకోవడంపై అనకాపల్లి ఎమ్మెల్యే అమర్నాథ్ స్పందించారు. బాలకృష్ణ అల్లుడికి చెందిన భూమిని స్వాధీనం చేసుకుంటే టీడీపీ ఎందుకు గగ్గోలు పెడుతోందని అడిగారు.

విశాఖపట్నం: గీతం యూనివర్శిటీ ఆక్రమణలో 40 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. భూ ఆక్రమణలపై అధికారులు వారి విధులను వారు నిర్వహిస్తే టీడీపీ నేతలు, ఎల్లో మీడియా ప్రతినిధులు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 

టీడీపీ నేతలు నారా లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు, చంద్రబాబు సన్నిహితుడు అయిన వ్యక్తి నుంచి భూమిని స్వాధీనం చేసుకుంటే టీడీపీ నేతలు ఎందుకు గగ్గోలు పెడుతున్నారని ఆయన అడిగారు. రూ.800 కోట్ల విలువ చేసే 40 ఎకరాల భూమినిి గీతం యూనివర్శిటీ ఆక్రమించిందని ఆయన శనివారం మీడియా సమావేశంలో ఆరోపించారు. 

గీతం యూనివర్శిటి ఆక్రమించిన భూమిపై కోర్టులో కేసులు లేవని, ో
 ప్రైవేట్ యాజమాన్యం భూమి ఆక్రమిస్తే దాన్ని స్వాధీనం చేసుకోవడం తప్పు అవుతుందా అని ఆయన అడిగారు. టీడీపీ పోలిట్ బ్యూరోలో ఉన్నవారంతా అత్యంత అవినీతికి పాల్పడినవారేనని, ఈఎస్ఐ కుంభకోణంలో ఉన్న అచ్చెన్నాయుడికి టీడీపీ అధ్యక్ష పదవి ఇచ్చారని ఆయన చెప్పారు. 

భూములు కాజేసినవారికే టీడీపీలో పదవులు ఇస్తున్నారని, టీడీపీ కార్యాలయం కూడా ఆక్రమణలో ఉందని ఆయన అన్నారు. ఆటక్రమించిన భూమిిక నోటీసులు ఇవ్వకుండా వందల కోట్ల విలువ భూమిని ఆక్రమిస్తే చూస్తూ ఊరుకోవాలా అని ఆయన అడిగారు. ప్రభుత్వంపై, తమ పా్రటీపై కక్ష సాధించడానికి తప్పుడు ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. 

గీతం యూనివర్శిటీలో గాంధీ పేరు చెప్పుకుని గాడ్సే పనులు జరుగుతున్నాయని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు అన్నారు విలువైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో విశాఖ ప్రజలు ఆనందిస్తున్నారని ఆయన చెప్పారు. గీతం యూనివర్శిటీ ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకోవడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

click me!