40 ఎకరాలకుపైగా భూకబ్జా: గీతం యూనివర్శిటీ నిర్మాణాల కూల్చివేత

By telugu teamFirst Published Oct 24, 2020, 11:22 AM IST
Highlights

విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీ అక్రమ నిర్మాణాలను రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు. గీతం యూనివర్శిటి 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని అక్రమించినట్లు విచారణలో తేలింది.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్  విశాఖపట్నంలో గల గీతం యూనివర్శిటీకి చెందిన కొన్ని కట్టడాలను రెవెన్యూ శాఖ అధికారులు కూల్చివేశారు. అక్రమ ఆక్రమణలంటూ వాటిని తొలగించారు. విశాఖ నగర శివారులోని రుషికొండ సమీపంలో పెద్ద యెత్తున గీతం యూనివర్శిటీ ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకుందని అంటూ దాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

దాదాపు 40 ఎకరాల భూమిని గీతం యూనివర్శిటీ ఆక్రమించుకున్నట్లు రెవెన్యూ శాఖ ప్రాథమిక విచారణలో తోలేది. యూనివర్శిటీ ప్రధాన ద్వారాన్ని కూడా అక్రమ నిర్మాణాల తొలగింపులో భాగంగానే కూల్చినట్లు ఆర్డీవో కిశోర్ కుమార్ చెప్పారు. 

ఆర్డీవో కిశోర్ పర్యవేక్షణలో రెవెన్యూ సిబ్బంది ఉదయం 6 గంటల నుంచి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకునే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా యూనివర్శిటీకి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేశారు. 

గీతం యూనివర్శిటీ యాజమాన్యం 40.51 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్లు రెవెన్యూ అధికారులు సమర్పించిన నివేదికలో తెలిపారు. రుషికొండ, ఎండాడల్లో కూడా కొంత భూమిని ఆక్రమించినట్లు తేలింది. దాంతో ఆ  భూములపై ప్రభుత్వం దృష్టి సారించింది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గీతం యూనివర్శిటీ ఆ భూములను ఆక్రమించినట్లు గుర్తించారు. 

విద్యాసంస్థల మధ్యలో అండర్ పాసేజ్ రహదారి నిర్మాణంపైన కూడా అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. గీతం ఇంజనీరింగ్ కాలేజీకి, మెడికల్ కాలేజీకి మధ్య సొరంగ మార్గాన్ని నిర్మించినట్లు తేలింది. 

click me!