తెలంగాణ ప్రభుత్వానికి విరుగుడు: సరిహద్దుల్లో ఏపీ బస్సులు

By telugu teamFirst Published Oct 24, 2020, 11:40 AM IST
Highlights

తెలంగాణకు ఏపీఎస్ ఆర్టీసీ బస్సులను అనుమతించకపోవడంతో పండుగ వేళ తమ స్వస్థలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 

అమరావతి: తెలంగాణ నుంచి తమ రాష్ట్రానికి వచ్చే స్థానికులకు ఇబ్బందులు ఏర్పడకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంది. దసరా పండుగ వేళ తమ రాష్ట్రంలోకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా బస్సులను అనుమతించకపోవడంతో స్వస్థలాలకు వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్ ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య బస్సుల పునరుద్ధరణకు ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య బస్సులు నడవడం లేదు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 

తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో తమ బస్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మోహరించింది. సరిహద్దుల్లోకి తెలంగాణ బస్సుల్లో వచ్చి అక్కడ తమ రాష్ట్ర బస్సులను ఎక్కి స్వస్థలాలకు వెళ్లడానికి వీలుంటుంది. సరిహద్దుల్లోని చెక్ పోస్టుల వద్ద భారీగా తమ రాష్ట్ర వాహనాలు అందుబాటులో ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నాని చెప్పారు. పంచలింగాల గరికపాడు చెక్ పోస్టుల వద్ద ఏపీ బస్సులు అందుబాటులో ఉన్నాయని ఆయన చెప్పారు 

తెలంగాణ ప్రభుత్వాధికారులతో ఒప్పందానికి తీవ్రంగా ప్రయత్నించామని ఆయన చెప్పారు. తెలంగాణలో సెలవుల వద్ద చర్చల కొనసాగింపునకు వీలు లేకుండా పోయిందని ఆయన చెప్పారు. జూన్ 18వ తేదీనుంచి మళ్లీ చర్చలు జరుగుతాయని ఆయన చెప్పారు. కర్ణాటక, తమిళనాడులకు బస్సులను పునరుద్ధరించినట్లు మంత్రి తెలిపారు.  

హైదరాబాదులోని ఏపీ ప్రజలు చాలా మంది తమ స్వస్థలాలకు వెళ్లడానికి ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. తమ ఇళ్ల నుంచే వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలా మంది బస్టాండ్లలో నిరీక్షిస్తున్నారు. 

click me!