జగన్ సిఎం అవ్వాలంటూ ఎంఎల్ఏ తిరుమలకు పాదయాత్ర

Published : Oct 21, 2017, 09:34 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
జగన్ సిఎం అవ్వాలంటూ ఎంఎల్ఏ తిరుమలకు పాదయాత్ర

సారాంశం

జగన్ సిఎం కావాలంటూ నరసరావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీర్మానం చేసుకున్నట్లున్నారు.

కోరికలు తీరితే తిరుమలకు వచ్చి మొక్కు చెల్లిస్తామని మొక్కుకోవటం సహజం. మరికొందరైతే ముందే ముడుపులు కూడా కట్టేస్తారు.  ఓ వైసీపీ ఎంఎల్ఏ కూడా జగన్ కోసం అటువంటి ముడుపే కట్టడం తాజాగా చర్చనీయాంశమైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావాలంటే మానవ ప్రయత్నంతో పాటు భగవంతుని ఆశీస్సులు కూడా ఉండాలని ఎంఎల్ఏ అనుకున్నట్లున్నారు. అందుకనే జగన్ సిఎం కావాలంటూ నరసరావుపేట ఎంఎల్ఏ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తీర్మానం చేసుకున్నట్లున్నారు. ఎటూ జగన్ కూడా స్వామీజీల ఆశీస్సుల కోసం మఠాలకు వెళుతున్న విషయం అందరూ చూస్తున్నదే.

అనుకోవటమే తడవుగా ఎంఎల్ఏ వెంటనే తిరుమల వెంకటేశ్వరునికి మొక్కుకున్నారు. అందుకనే శనివారం నరసరావుపేట నుండి తిరుమలకు కాలినడకన బయలుదేరుతున్నారు. రోజుకు 30 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. జగన్మోహన్ రెడ్డి సిఎం అవ్వటమే తనకు ముఖ్యమన్నారు. అందుకనే తిరుమల వెంకన్నకు మొక్కకున్నట్లు చెప్పారు.

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu