ఓటుకునోటు: చంద్రబాబుకు సంబంధమే లేదు

Published : Oct 21, 2017, 07:54 AM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
ఓటుకునోటు: చంద్రబాబుకు సంబంధమే లేదు

సారాంశం

ఎవరికీ తెలీని ఓ విషయాన్ని తెలంగాణా టిడిపిలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తాజాగా బయటపెట్టారు. ఇంతకీ ఆ విషయమేంటంటే ? ఓటుకునోటు కేసులో అసలు చంద్రబాబునాయుడు పాత్రే లేదట.

రెండు రాష్ట్రాల్లో రెండేళ్ళ క్రితం సంచలనం సృష్టించిన ‘ఓటుకునోటు’ కేసు అందరికీ తెలిసిందే. అందులో పాత్రదారులెవరు ? సూత్రదారులెవరు? అన్న విషయంలో యావత్ ప్రపంచం మొత్తానికి ఓ అవగాహనుంది. వీడియో సాక్ష్యంగా దొరికింది ఎవరు? బయటపడిన ఆడియో టేపుల్లో వినిపించిన గొంతు ఎవరిదో అందరికీ తెలుసు. అయితే, ఎవరికీ తెలీని ఓ విషయాన్ని తెలంగాణా టిడిపిలో సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు తాజాగా బయటపెట్టారు. ఇంతకీ ఆ విషయమేంటంటే ? ఓటుకునోటు కేసులో అసలు చంద్రబాబునాయుడు పాత్రే లేదట.

ఓటుకునోటు కేసు మొత్తం రేవంత్ సొంత వ్యవహారమట. తనంతట తానుగా సొంతంగా నిర్ణయంగా తీసుకుని చంద్రబాబును గబ్బు పట్టించారట. రేవంత్ వల్లే తెలంగాణాలో టిడిపి భ్రష్టుపట్టిపోయిందట. వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్-టిడిపి మధ్య పొత్తులుంటాయని ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవేళ అదే నిజమైతే ఓటుకునోటు కేసులో నుండి చంద్రబాబును తప్పించి రేవంత్ ను మాత్రమే ఇరికించే వ్యూహమేదన్నా మొదలైందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

 

PREV
click me!

Recommended Stories

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం లోఫుడ్ కమీషన్ చైర్మన్ తనిఖీ | Asianet News Telugu
LVM3-M6 Success Story | ప్రపంచానికి భారత్ సత్తా చాటిన ఇస్రో బాహుబలి | Asianet News Telugu