చంద్రబాబుపై ఎన్నికల సంఘానికి వైసీపీ ఫిర్యాదు

First Published Jul 17, 2017, 4:47 PM IST
Highlights
  • ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబే ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు మండిపడ్డారు. 
  • పదిమంది మంత్రులు నంద్యాలలోనే మకాం వేసి అరాచకాలకు పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు.

నంద్యాల ఉపఎన్నిక సందర్భంగా వైసీపీ ఎంపిలు చంద్రబాబునాయుడుపై ప్రధాన ఎన్నికల కమీషనర్ ఏకె జోతిని కలిసి ఈరోజు ఫిర్యాదు చేసారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టిడిపి గుర్తింపును రద్దు చేయాలంటూ ఫిర్యాదు చేయటం గమనార్హం. ఉపఎన్నిక సందర్భంగా చంద్రబాబే ఓటర్లను ప్రలోభ పెడుతున్నట్లు మండిపడ్డారు. ఫిర్యాదు అనంతరం ఒంగోలు ఎంపి వైవి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, పదిమంది మంత్రులు నంద్యాలలోనే మకాం వేసి అరాచకాలకు పాల్పడుతున్నట్లు ధ్వజమెత్తారు. అధికారులు కూడా ప్రభుత్వానికే అనుకూలంగా పనిచేస్తున్నట్లు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా చెప్పామన్నారు. నంద్యాలలో ఎన్నిక పాదర్శకంగా జరగాలంటే కేంద్ర బలగాలను పంపాలని తాము కోరినట్లు ఎంపి తెలిపారు. నంద్యాలలో పర్యటించిన సందర్భంగా సిఎం ఓటర్లను బెదిరించిన సంగతిని కూడా తమ ఫిర్యాదులో పేర్కొన్నట్లు రెడ్డి చెప్పారు. అంతుకుముందు టిడిపి ఎంఎల్ఏ రేవంతరెడ్డి ఓటు కొనుగోలుకు రూ. 50 లక్షలిస్తూ పట్టుబడిన విషయాన్ని కూడా గుర్తు చేసినట్లు తెలిపారు.

click me!