మహిళా వీవోఏ ఆత్మహత్య కేసులో వైసిపి నేత అరెస్ట్... అసలేం జరిగిందంటే..: పోలీసుల వివరణ

Arun Kumar P   | Asianet News
Published : Mar 18, 2022, 05:06 PM ISTUpdated : Mar 18, 2022, 05:16 PM IST
మహిళా వీవోఏ ఆత్మహత్య కేసులో వైసిపి నేత అరెస్ట్... అసలేం జరిగిందంటే..: పోలీసుల వివరణ

సారాంశం

మచిలీపట్నం వీవోఏ నాగలక్ష్మి ఆత్మహత్య కేసులో వైసిపి నేత నరసింహారావు అరెస్టయ్యాడు. ఈ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు. 

మచిలీపట్నం: కృష్ణా జిల్లా మచిలీపట్నం (machilipatnam) మండల వీవోఏ (VOA)ల సంఘం నాయకురాలు గరికపాటి నాగలక్ష్మి (42) ఆత్మహత్య కేసులో వైసిపి (YSRCP) నాయకుడు నరసింహారావును పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే ఆత్మహత్యకు ముందు నాగలక్ష్మి రాసిన సూసైడ్ లెటర్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా నిందితుడు నరసింహారావును పోలీసులు మీడియా ముందు హాజరుపర్చారు. ఈ సందర్భంగా వీఏఓ ఆత్మహత్మకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బందరు తాలూకా బొగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గరికిపాటి నాగలక్ష్మి-వీర కృష్ణమోహన రావు భార్యాభర్తలు. నాగలక్ష్మి గ్రామ సమక్య సంఘంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ (Village Organisation Assitent)(Book Keeper)గా పనిచేస్తోంది. ఆమె ఆధీనంలోనే సుమారు 37 స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి. సదరు సంఘాలు యొక్క పొదుపు వివరాలు, లోన్ మంజూరు వంటి వివరాలను పుస్తకాలలో నమోదు చేసేది. 

సూసైడ్ లెటర్ 

అయితే నాగలక్ష్మి పరిధిలోని భ్రమరాంబిక స్వయం సహాయక సంఘంలో గరికిపాటి నాగమణి అనే మహిళ సభ్యురాలిగా వుండేది. లోన్ మంజూరు విషయంలో నాగలక్ష్మి, నాగమణికి మధ్య వివాదం చెలరేగింది.   ఈ క్రమంలోరు నాగమణి భర్త నరసింహరావు పలుమార్లు నాగలక్ష్మితో గొడవపడి బూతులు తిడుతూ ఆమె గురించి అసత్య ప్రచారం చేసినట్లు పోలీసులు తెలిపారు.  గత నెల పిబ్రవరి 23న వెలుగు ఆఫీసు    సమావేశం జరుగుతుండగా నరసింహరావు అక్కడికి వచ్చి నాగలక్ష్మితో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా దుర్భాషలాడుతూ దాడికి దాడికి కూడా యత్నించినట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.

ఆ తర్వాతి రోజే  అంటే ఫిబ్రవరి 24వ తేదీన నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా నరసింహరావు, నాగమణి దంపతులను స్థానిక ఎస్సై పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. సదరు ముద్ధాయిలు ఆమె జోలికి వెళ్ళను అని హమీపత్రం రాసి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. 

ఇటీవల అంటే మార్చ్14న నాగలక్ష్మి కృష్ణా జిల్లా ఎస్పీకి స్పందన కార్యక్రమానికి వెళ్ళి ఫిర్యాదు చేసినట్లు... వెంటనే ఆయన నిందితులపై చర్య తీసుకోవాలని సీఐని ఆదేశించినట్లు పోలీసులు తెలిపారు. సీఐ కూడా నాగలక్ష్మిని పిలిచి విచారించి అనంతరం పిర్యాదులో పేర్కొన్న  వారిని కూడా పిలిచి విచారించినట్లు సమాచారం. తర్వాత రోజు బందరు సీఐ ఆదేశాలతో ఎస్సై 16వ తేదీనే సదరు ఫిర్యాదుపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారని... బందరు రూరల్ స్టేషన్లో  నాగలక్ష్మి ఫిర్యాదుపై Cr.No-105/2022 U/s 354 354 –A 506, 509 r/w 34 IPC కేసుగా నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఇదే రోజున సాయంత్రం సమయంలో నరసింహరావు దుర్బషాలాడుతూ తిట్టడంతో అవమానంగా భావించిన నాగలక్ష్మి పురుగులమంధు త్రాగి ఆత్మ హత్యకు యత్నించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె కుమారుడు ఇది గమనించి తల్లిని చిన్నాపురం హాస్పిటల్ తీసుకువెళ్లగా అక్కడ పరిస్థితి విషమించి మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్య పొందుతూ 17వ తేదీన తేధీన ఉదయం  నాగలక్ష్మి చనిపోయింది. 

మృతురాలి కుమారుడు గరికిపాటి పార్ధ శివసాయి ఫిర్యాదుపై చిలకలపూడి పోలీసు స్టేషన్ Cr.No-63/2022 U/s 306 IPC కేసు నమోదుచేసి ముద్దాయి గరికిపాటి నరసింహరావుని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఇవాళ నిందితుడిని జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు మచిలీపట్నం డిఎస్పీ  షేక్ మాసూం భాష వెల్లడించారు. 


 
 

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్