దారుణం.. పెయింటర్ ను గదిలో బంధించి వైసీపీ నేత దాష్టీకం...

By SumaBala BukkaFirst Published Nov 26, 2022, 9:02 AM IST
Highlights

ఓ వైసీపీ నేత దారుణానికి ఒడిగట్టాడు. తన ఇంటికి పెయింటింగ్ కాంట్రాక్ట్ ఇచ్చిన సేల్స్ వ్యక్తిని గదిలో బంధించాడు. 

విశాఖపట్నం : ఓ వైసీపీ నేత తాను కట్టుకుంటున్న కొత్తింటికి రంగులు సరఫరా చేసేందుకు ఓ పెయింటింగ్ సంస్థ కు చెందిన సేల్స్ మెన్ తో  ఒప్పందం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఏం జరిగిందో తెలియదు కానీ అతడిని ఆ వైసీపీ నేత ఒక రోజు మొత్తం గదిలో బంధించి ఉంచాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో విశాఖ జిల్లా పెందుర్తిలో కలకలం రేగింది. సిఐ గొల్లగాని అప్పారావు ఈ ఘటనకు సంబంధించి తెలియ జేసిన వివరాలు ఇలా ఉన్నాయి. శరగడం చిన్న అప్పలనాయుడు విశాఖ గ్రామీణ జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ఉన్నాడు. ఆయన పెందుర్తిలోని ఎల్ఐసి కాలనీలో సొంత ఇల్లు కట్టుకుంటున్నాడు. దీనికి పెయింటింగ్  వేసేందుకు ఓ సంస్థలో సేల్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న సాగి లలిత్ సుబ్రమణ్య వర్మ(28)తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ పనులుమూడు నెలలుగా జరుగుతున్నాయి. 

ఇదే క్రమంలో.. పనిని పర్యవేక్షించేందుకు గురువారం ఉదయం సుబ్రమణ్యం అక్కడికి వెళ్లాడు. ఆ సమయంలో చిన్న అప్పలనాయుడు అక్కడే ఉన్నాడు. వర్మ పనిచేస్తున్న కంపెనీకి చెందిన రంగులు వద్దని చెప్పాడు. వేరే సంస్థకు చెందిన రంగులను వాడాలని వర్మకు తెలిపాడు. దీనికి వర్మ కుదరదని చెప్పాడు. దీంతో చిన్న అప్పలనాయుడు ఆగ్రహానికి వచ్చాడు. వర్మ సెల్ ఫోన్, టూవీలర్ తాళాలు, బ్యాగ్ ను లాక్కున్నాడు. అక్కడే ఉన్న మహేష్ అనే వ్యక్తి, మరో ఇద్దరి సహాయంతో అతడిని ఓ గదిలో బంధించారు. ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన కొడుకు రాత్రంతా ఇంటికి రాకపోవడంతో.. శుక్రవారం ఉదయం వర్మ తల్లి చిన్న అప్పలనాయుడు కడుతున్న కొత్తింటికి వచ్చింది. అక్కడ ఇంటి ఆవరణలో తన కొడుకు వర్మ బండి కనిపించింది. ఇది గమనించిన ఆమె తన కొడుకు కోసం ఆరా తీసింది.

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ బీసీ నేతలతో నేడు సీఎం వైఎస్‌ జగన్ భేటీ

అయితే, వర్మ సంగతి తనకు తెలియదని వైసీపీ నేత చెప్పడంతో ఆమె గొడవకు దిగింది. తెలియకపోతే.. తన కొడుకు బండి ఇక్కడ ఎలా ఉంది అని అనుమానం వ్యక్తం చేసింది. ఇంతలో వర్మ తనను బంధించిన గదిలోనుంచి తల్లిని చూశఆడు. వెంటనే గట్టిగా కేకలు వేశాడు. ఇది గమనించిన వర్మ తల్లి తన కొడుకును పంపాలని అడిగింది. అయితే దీనికి అప్పలనాయుడు ఒప్పుకోలేదు.. సాయంత్రం పంపిస్తాను పో అంటూ చెప్పాడు. దీంతో సాయంత్రం వరకు కొడుకును ఏం చేస్తారో అని భయపడిన ఆమె పోలీసులను ఆశ్రయిస్తానని చెప్పింది. తన కొడుకును బంధించారని  ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. దీంతో కాస్త తగ్గిన అప్పలనాయుడు మనుషులు వర్మను విడిచిపెట్టారు. ఆ తరువాత తల్లితో కలిసి వెళ్లిన వర్మ.. ఈ మేరకు పెందుర్తి పోలీసులకు అప్పలనాయుడు మీద ఫిర్యాదు చేశాడు.

ఆ ఫిర్యాదులో తనకు ప్రాణహాని ఉందని వర్మ పేర్కొన్నాడు. అతని ఫిర్యాదు మేరకు వైసీపీ నేత శరగడం చిన అప్పలనాయుడు, మహేష్, వారికి సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. అయితే దీనిని చిన అప్పలనాయుడు ఖండించాడు. ఇంటికి పెయింటింగ్ వేసే పనులను తాను ఒక కంపెనీకి అప్పగించానని.. అయితే వేరే కంపెనీతో ఆ కంపెనీకి వివాదం నెలకొన్నదని.. ఈ కారణంగానే తనపై తప్పుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. వర్మతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తన ప్రత్యర్థులు వర్మ ద్వారా తనపై తప్పుడు ఫిర్యాదు చేయించారని వాపోయారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు కదా.. వారి విచారణలో వాస్తవాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు. 

click me!