టిడిపి అంటే దొంగల పార్టీయా ?

Published : Dec 24, 2016, 09:03 AM ISTUpdated : Mar 26, 2018, 12:01 AM IST
టిడిపి అంటే దొంగల పార్టీయా ?

సారాంశం

జానీమూన్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే విచారణ చేయించాలని కూడా డిమాండ్ చేసారు.

తెలుగుదేశంపార్టీపై ప్రతిపక్ష ఎంఎల్ఏ ఆర్ కె రోజా కొన్ని ప్రశ్నలు సంధించారు. టిడిపి అంటే దొంగల పార్టీనా లేక దుర్యోధనుల పార్టీయా అంటూ నిలదీసారు. చంద్రబాబు పాలనలో మహిళల మాన ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ధ్వజమెత్తారు.

 

మహిళలపై ఎంఎల్ఏలు, మంత్రులు వేధింపులు, దాడులు ఎక్కువైపోయినట్లు తూర్పారబట్టారు. ఇప్పటికే టిడిపిలోని ఇద్దరు మహిళా ప్రజాప్రతినిధులు మరణించగా గుంటూరు జడ్ పి ఛైర్ పర్సన్ జానీమూన్ పై మంత్రి రావెల కిషోర్ బాబు వేధింపులకు పాల్పడటం సిగ్గు చేటన్నారు.

 

దాడులకు గురౌతున్నది, వేధిపుల పాలవుతున్నది టిడిపి మహిళా ప్రజాప్రతినిధిలే అయినప్పటికీ ఓ మహిళగా తాను స్పందిస్తున్నట్లు చెప్పారు. మంత్రివర్గంలోని మహిళా మంత్రులు కూడా స్పందించి రావెలను మంత్రివర్గం నుండి భర్త్ రఫ్ చేసేట్లుగా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేసారు.

 

తనపై మంత్రి హత్యాయత్నం చేయించినట్ల జానీమూన్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం వెంటనే విచారణ చేయించాలని కూడా డిమాండ్ చేసారు.

 

మంత్రి నారాయణ కళాశాలలో విద్యార్ధినులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇంత వరకూ విచారణ కూడా చేయించలేదన్నారు. కాబట్టి నారాయణను కూడా భర్త్ రఫ్ చేయాలన్నారు. రాష్ట్రంలో పరిస్ధితులు ఇంత దారుణంగా ఉంటే టిడిపికి 175 సీట్లు రావాలని చంద్రబాబు చెప్పటాన్ని రోజా ఎద్దేవా చేసారు.

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu