ప్రతిపక్షాలు పార్టీలను మూసేయొచ్చు

Published : Dec 24, 2016, 05:35 AM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
ప్రతిపక్షాలు పార్టీలను మూసేయొచ్చు

సారాంశం

కాంగ్రెస్ర్, వామపక్షాలు, ఆఖరకు మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కూడా తమ పార్టీ శాఖలను మూసేయవచ్చు

ఇంతకాలం రాష్ట్రాన్ని సింగపూర్ లాగ తయారు చేస్తానని చంద్రబాబునాయడు అంటుంటే అభివృద్ధిలోనేమో అనుకున్నారు జనాలు. కానీ కాదని ఇప్పుడే అర్ధమవుతోంది. ప్రతిపక్షం లేకుండానని. సింగపూర్లో ప్రతిపక్షమన్నదే లేదు. పైగా వంశపాలన సాగుతోంది.

 

అంటే చంద్రబాబు ఉద్దేశ్యం జీవిత కాలం తానే ముఖ్యమంత్రిగా ఉండాలని. అదే సమయంలో తన తదనంతరం కుమారుడు లోకేష్ బాబే ముఖ్యమంత్రి అవ్వలని. కాబట్టి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీని మూసేసుకోవచ్చు.

 

కాంగ్రెస్ర్, వామపక్షాలు, ఆఖరకు మిత్రపక్షం భారతీయ జనతా పార్టీ కూడా తమ పార్టీ శాఖలను మూసేయవచ్చు. ఒక్క పవన్ కల్యాణ్ మాత్రం అదృష్టవంతుడే. ఎందుకంటే, పార్టీకి గుడ్ బై చెప్పేసి ఎంచక్క సినిమాలకే పూర్తి సమయాన్ని కేటాయించుకోవచ్చు.

 

వైసీపీ శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన శుక్రవారం టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఆ సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ, వచ్చే ఏబై సంవత్సరాలూ తెలుగుదేశం పార్టీనే అధికారంలో ఉండాలని చెప్పటం గమనార్హం.

 

ప్రభుత్వ పరంగా ప్రజల్లో 80 శాతం సంతృప్తి ఉందన్నారు. పార్టీ పట్ల కూడా ప్రజల్లో అదే స్ధాయిలో మద్దతు రావాలన్నారు. స్ధానికంగా మంచి నాయకత్వం ఉంటే మొత్తం 175 నియోజకవర్గాల్లోనూ టిడిపీనే గెలుస్తుందని చెప్పటం విచిత్రంగానే ఉంది. రాష్ట్రంలోని అన్నీ నియోజకవర్గాల్లోనూ టిడిపీనే గెలిచ్చేట్లయితే ఇక, ప్రతిపక్షాలెందుకు దండగ.

 

కాకపోతే ఇక్కడ మేధావి చంద్రబాబు ఓ మెలిక పెట్టారు. ఎక్కడైనా పార్టీ ఓడిపోతే అది స్ధానిక నాయకత్వం లోపమేనన్నారు. చూసారా నిప్పు చంద్రబాబుకు ఎంత ముందు జాగ్రత్తో. మొన్నటి ఎన్నికల్లో కల్పనపై పోటీ చేసి ఓడిపోయిన వర్ల రమాయ్య  కల్పనను స్వాగతించటం సంతోషమన్నారు.

 

మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇదే స్పూర్తి ఉండాలన్నారు. అంటే అర్దం ఏమిటో చంద్రబాబే చెప్పాలి. ఎందుకంటే, వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏలు టిడిపిలో చేరిన నియోజకవర్గాల్లో పాత-కొత్త నేతల మధ్య ఎంతటి సఖ్యత ఉందో అందరికీ తెలిసిందే. నాలుగు రోజులు పోతే కల్పన-వర్ల వ్యవహారం కూడా తేలిపోదా.

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?
Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?