ఏపీ సీఎం వైఎస్ జగన్ పై టీడీపీ నేతల అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా జనాగ్రహదీక్షలు చేపట్టారు.చంద్రబాబు, టీడీపీ నేతల దిష్టిబొమ్మలను దగ్దం చేశారు.
అమరావతి: ఏపీ సీఎం ys Jaganపై టీడీపీ నేతలు అసభ్య పదజాలంతో దూషించడాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు గురువారం నాడు జనాగ్రహ దీక్షలకు దిగారు.ఏపీ సీఎం వైఎస్ జగన్ నుTdp అధికార ప్రతినిధి Pattabhi చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ ycp janaagraha deekshalu దిగింది. ఈ దీక్షల్లో ఎక్కడికక్కడే మంత్రులు, వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు దీక్షలు నిర్వహించారు.
also read:చేతకాకపోతే ఇంటికి వెళ్లిపొండి,డీజీపీపై ఫైర్: 36 గంటల దీక్షను ప్రారంభించిన బాబు
undefined
ప్రకాశం, అనంతపురం, పశ్చిమగోదావరి, కృష్ణా సహా పు జిల్లాల్లో ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేపట్టారు. టీడీపీ నేతల దిష్టిబొమ్మలు దగ్దం చేశారు. టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని పలు చోట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.శ్రీకాకుళం, కడప జిల్లాల్లో పట్టాభిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు ధర్నాకు దిగారు.తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో కూడ ఆ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి.
టీడీపీ నేతలు, ఆ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ నెల 20న టీడీపీ ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. అయితే ఈ బంద్ విఫలమైందని ప్రజలు ఎవరూ కూడ ఈ బంద్ లో పాల్గొనలేదని వైసీపీ విమర్శలు గుప్పించింది.ఇదిలా ఉంటే టీడీపీ కార్యాలయాలపై దాడులు నిరసిస్తూ Chandrababu అమరావతిలోని పార్టీ కార్యాలయంలోనే 36 గంటల దీక్షకు దిగాడు.
మరోవైపు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలపై ఏపీ సీఎం Ys jagan స్పందించారు. సీఎంపై బూతులు మాట్లాడడంపై ఆవేదన వ్యక్తం చేశారు.