చేతకాకపోతే ఇంటికి వెళ్లిపొండి,డీజీపీపై ఫైర్: 36 గంటల దీక్షను ప్రారంభించిన బాబు

By narsimha lodeFirst Published Oct 21, 2021, 9:48 AM IST
Highlights

తమ పార్టీ నేతలు, కార్యాలయాలపై దాడులు చేసి మాపైనే కేసులు బనాయిస్తారా అని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు మండిపడ్డారు. 

అమరావతి: పోలీసులకు చేతకాకపోతే ఇంటికి వెళ్లిపోండి, మమ్మల్ని మేమే కాపాడుకొంటామని Tdp చీఫ్ Chandrababu Naidu చెప్పారు.గురువారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో 36 గంటల దీక్షను చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.మాపై , మా పార్టీ కార్యాలయాలపై దాడులు చేసి మళ్లీ కేసులు బనాయిస్తారా  డీజీపీ మీకు సిగ్గుందా  అని ప్రశ్నించారు.

also read:బోసిడికే అని తిట్టారు, ఆ పదానికి అర్థం లం... కొడుకు: వైఎస్ జగన్

రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలపై దాడులను నిరసిస్తూ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నాడు 36 గంటల నిరసన దీక్షను టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ప్రారంభించారు.పోలీసులకు చేతకాకపోతే ఇంటికి వెళ్లి పోవాలని ఆయన చెప్పారు. తమ పార్టీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై దాడుల వెనుక పెద్ద కుట్ర జరిగిందని ఆయన ఆరోపించారు.తన రాజకీయ జీవితంలో ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు. టీడీపీని తుదముట్టంచేందుకు వైసీపీ కుట్ర పన్నిందన్నారు.

టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసినా కూడా స్పందించలేదని చెప్పారు. కానీ కిందిస్థాయి  పోలీసు అధికారులకు సమాచారం ఇస్తే  ఏం జరిగిందని  ప్రశ్నించారన్నారు. పట్టాభి ఇంటిపై దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేయకపోగా పట్టాభినే అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. టీడీపీ కార్యాలయానికి సీఐ అధికారి ఎందుకు వచ్చారు.. మా అనుమతి లేకుండా ఆయన రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందన్నారు. మీ ఇంటికి అనుమతి లేకుండా వస్తే అనుమతిస్తారా అని ఆయన ప్రశ్నించారు. పైగా తమ పార్టీకి చెందిన నేతలపైనే 302 సెక్షన్ల కింద కేసు పెట్టారని ఆయన మండిపడ్డారు.

రాష్ట్రంలో తమ పార్టీ కార్యాలయాలపై దాడి విషయమై పోలీసులు స్పందించకపోతే తాను గవర్నర్, కేంద్ర హోంశాఖ మంత్రి Amit shahకు ఫోన్ చేసి రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిణామాలను వివరించానన్నారు. Dgp కార్యాలయం నుండే దుండగులు వచ్చి దాడికి దిగారని ఆయన ఆరోపించారు. టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన తర్వాత దుండగులను పోలీసులు దగ్గరుండి సాగనంపారని  చంద్రబాబు మండిపడ్డారు. శాంతి భద్రతలు కాపాడడంలో విఫలమైతే ఆర్టికల్ 356 ను ప్రయోగిస్తారన్నారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీలోనే ఉంటున్నాయన్నారు.గంజాయి, సాగుపై ఉక్కుపాదం మోపండి సహకరిస్తామని ఆయన చెప్పారు. గంజాయి స్మగ్లింగ్  సాగుపై ఉక్కుపాదం మోపితే సహకరిస్తామన్నారు.దేశ చరిత్రలో ఏనాడూ కూడ పార్టీ కార్యాలయాలపై దాడులు జరగలేదని ఆయన గుర్తు చేశారు.

ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను కంకణబద్దుడినై ఉన్నానని ఆయన చెప్పారు. వైసీపీ నేతలు, ఏపీకి చెందిన మంత్రులు తనపై, తమ పార్టీ నేతలపై ఉపయోగించిన అసభ్య పదజాలంపై పోలీసులు ఏం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు.వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలన్నారు.

click me!